మూడోఏడాది “వైఎస్ఆర్ వాహన మిత్ర” ప్రారంభించిన సీఎం జగన్, వారి ఖాతాల్లో 10 వేలు జమ

248 Crore under YSR Vahana Mitra, AP CM YS Jagan Mohan reddy, CM YS Jagan, CM YS Jagan Released Rs 248 Crore under YSR Vahana Mitra, CM YS Jagan Released Rs 248 Crore under YSR Vahana Mitra Today, Mango News, Vahana Mitra launch today, YS Jagan Released Rs 248 Crore under YSR Vahana Mitra, YSR Vahana Mitra, YSR Vahana Mitra Amount, YSR Vahana Mitra Scheme

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూన్ 15, మంగళవారం నాడు మూడో ఏడాది “వైఎస్ఆర్ వాహన మిత్ర” కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా నేరుగా 2,48,468 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.248.47 కోట్లను జమ చేశారు. రాష్ట్రంలో సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వాహనాల మరమ్మతులు, బీమా, ఇతర ఖర్చుల కోసం ఒక్కొక్కరికీ వరుసగా మూడో ఏడాది కూడా రూ.10వేలు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈ రోజు జమ చేసిన రూ.248.47 కోట్ల నగదుతో కలిపి ఇప్పటివరకు వాహనమిత్ర కింద డ్రైవర్లకు రాష్ట్రప్రభుత్వం రూ.759 కోట్లను అందజేసింది.

ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్‌ మాట్లాడుతూ, వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర అమలు చేయడం ఆనందంగా తెలిపారు. పాదయాత్ర సమయంలో ఏలూరు సభలో డ్రైవర్ల కోసం మాట ఇచ్చానని, ఆ మాటకు కట్టుబడి ప్రజలకు ఎంతో సేవలు అందిస్తున్న సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సహాయంగా వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర అమలు చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది 2.48 లక్షల మందికి రూ.248.47 కోట్ల నగదు జమ చేస్తున్నామని, వీరిలో దాదాపుగా 84 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనారిటీ వర్గాలకు చెందిన వారే ఉన్నారని సీఎం వైఎస్ జగన్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here