కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022: పదోరోజు 5 స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్యాలు, 55కి భారత్ పతకాల సంఖ్య

CWG 2022 India Won 15 Medals on 10th day Total Tally Reach to 55, India Won 15 Medals on 10th day Total Tally Reach to 55, India Won 15 Medals on 10th day In CWG 2022, India Medals Total Tally Reach to 55, India Won 15 Medals, CWG-2022, Commonwealth Games-2022, Birmingham Commonwealth Games 2022, 2022 Birmingham Commonwealth Games, Birmingham Commonwealth Games, Commonwealth Games, Birmingham Alexander Stadium, Commonwealth Games 2022 sports, Birmingham Commonwealth Games 2022 News, Birmingham Commonwealth Games 2022 Latest News, Birmingham Commonwealth Games 2022 Latest Updates, Birmingham Commonwealth Games 2022 Live Updates, Mango News, Mango News Telugu,

కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 లో భారత్ అథ్లెట్స్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గేమ్స్ లో 10వ రోజైన ఆగస్టు 7, ఆదివారం నాడు ఐదు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఆరు కాంస్యాలతో మొత్తం 15 పతకాలను భారత్ అథ్లెట్స్ గెలుచుకున్నారు. దీంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో 55 (18 స్వర్ణ, 15 రజతం, 22 కాంస్యం) పతకాలు చేరగా, ర్యాంకింగ్స్ లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. ఆదివారం ముఖ్యంగా భారత్ బాక్సర్లు సత్తా చాటారు. అమిత్ పంగాల్, నిఖత్ జరీన్, నీతు గంగాస్ స్వర్ణ పతకాలు గెలుచుకోగా, సాగర్ అహ్లావత్ రజతం దక్కించుకున్నాడు. శనివారం నాడు బాక్సింగ్ విభాగంలో రోహిత్ టోకాస్, జైస్మిన్ లంబోరియా, మహ్మద్ హుసాముద్దీన్ కాంస్య పతకాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఎడిషన్ లో మొత్తం ఏడుగురు బాక్సర్లు పతకాలు సాధించినట్టయింది.

అలాగే కాంస్యపతక పోరులో 2–1తో న్యూజిలాండ్‌పై భారత్ మహిళల హాకీ జట్టు ఘన విజయం సాధించి పతాకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు మహిళా క్రికెట్ లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ జట్టుపై ఆస్ట్రేలియా 9 పరుగుల తేడా విజయం సాధించింది. దీంతో భారత్ జట్టుకు రజతం దక్కింది. ఇక ఆదివారం పతకాలు దక్కించుకున్న భారత్ అథ్లెట్స్ అందరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. కాగా సోమవారంతో కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 ముగియనున్నాయి.

ఆదివారం పతకాలు సాధించిన భారత్ అథ్లెట్స్ (15):

 1. నిఖత్ జరీన్ – బాక్సింగ్ – స్వర్ణం
 2. నీతు గంగాస్ – బాక్సింగ్ – స్వర్ణం
 3. అమిత్ పంగాల్ – బాక్సింగ్ – స్వర్ణం
 4. ఎల్డోస్ పాల్ – పురుషుల ట్రిపుల్ జంప్ – స్వర్ణం
 5. శరత్ కమల్,శ్రీజ ఆకుల – టేబుల్ టెన్నిస్ – స్వర్ణం
 6. సాగర్ అహ్లావత్ – బాక్సింగ్ – రజతం
 7. శరత్ కమల్, సాథియాన్ జ్ఞానశేఖరన్ – టేబుల్ టెన్నిస్ – రజతం
 8. అబ్దుల్లా అబూబకర్ – పురుషుల ట్రిపుల్ జంప్ – రజతం
 9. భారత్ మహిళల జట్టు -క్రికెట్ – రజతం
 10. భారత్ మహిళల జట్టు -హాకీ – కాంస్యం
 11. సందీప్ కుమార్ – పురుషుల 10000 మీ రేస్ వాక్ – కాంస్యం
 12. అన్నూ రాణి – మహిళల జావెలిన్ త్రో – కాంస్యం
 13. దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ – స్క్వాష్ – కాంస్యం
 14. కిదాంబి శ్రీకాంత్ – బ్యాడ్మింటన్ – కాంస్యం
 15. ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ – బ్యాడ్మింటన్ – కాంస్యం.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here