పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంఫాన్ తుపాను కొనసాగుతుంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా మరింత బలపడి తీవ్రమైన తుఫాన్ స్థాయి నుంచి పెనుతుఫాన్ గా మార్పు చెందుతుంది. ఈ అంఫాన్ వలన పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ రాష్ట్రాలపై భారీ ప్రభావం చూపే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం సాయంత్రం డిఘా(పశ్చిమ బెంగాల్), హైతి దీవులు(బంగ్లాదేశ్) మధ్య ఈ తుఫాన్ తీరం దాటనునుందని ప్రకటించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 165 నుంచి 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
అంఫాన్ తుఫాన్ నేపథ్యంలో ఏపీలోని తీర ప్రాంతాల్లోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ ఇటీవలే ఈ తుఫాన్ ఫై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. అంఫాన్ తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ఆంధ్రప్రదేశ్ వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. ముఖ్యంగా విద్యుత్తు, వైద్యశాఖ, రెవిన్యూ, పౌరసరఫరాలు శాఖలు అప్రమత్తంగా ఉండి, తుఫాను వలన ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చేప్పారు. మత్స్య కారులు బోట్లలో సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని, ఒక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలనీ అధికారులకు సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu