దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్: ఉత్తమ కేటగిరీలను గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’, రణబీర్ కపూర్

Dadasaheb Phalke International Film Festival Awards 2023 RRR and The Kashmir Files, Ranbir Kapoor and Alia Bhatt Wins The Best Categories,Dadasaheb Phalke International Film Festival Awards 2023,RRR ,The Kashmir Files, Ranbir Kapoor,Alia Bhatt Wins The Best Categories,Mango News,Mango News Telugu,Dadasaheb Phalke International Film Festival Awards 2023,Dadasaheb Phalke International Film Festival Awards Wiki,Dadasaheb Phalke Award 2023 Nomination List,Dadasaheb Phalke International Film Festival Awards History,Dadasaheb Phalke Award 2023 Vote,Dadasaheb Phalke Award 2023 Date,52 Dada Saheb Phalke Award,Dadasaheb Phalke International Film Festival Awards 2022 Winners List,Dadasaheb Phalke International Film Festival Awards 2021,Dadasaheb Phalke International Film Festival Awards 2022,Dadasaheb Phalke International Film Festival Awards,Dadasaheb Phalke International Film Festival Awards 2020,Dadasaheb Phalke International Film Festival Awards 2018,Dadasaheb Phalke International Film Festival Awards 2019,Dadasaheb Phalke International Film Festival Awards 2022 In Hindi

భారతీయ సినిమా రంగంలో అందించే దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ గత రాత్రి 2023 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో అవార్డులను గెలుచుకున్న విజేతల జాబితాను ప్రకటించింది. సోమవారం ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు సినీ పరిశ్రమలోని నటీనటులు హాజరయ్యారు. హిందీ చిత్రాలతో పాటు పలు ప్రాంతీయ సినిమాలు, పలువురు నటీనటులు ఈ అవార్డులను గెలుచుకున్నారు. భారతదేశ అగ్రదర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మరియు బాలీవుడ్ విలక్షణ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలు అవార్డులను కైవసం చేసుకున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్‌గానూ, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఉత్తమ చిత్రంగానూ అవార్డులను అందుకున్నాయి. ఇక సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’లో గంగూబాయి పాత్రలో అద్భుత నటనకు గానూ అలియా భట్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకోగా.. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి గానూ రణబీర్ కపూర్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే ‘బెస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌’గా ‘కాంతారా’ ఫేమ్ రిషబ్ శెట్టి ఎంపికయ్యారు. ‘భేదియా’ చిత్రానికి గానూ వరుణ్ ధావన్‌కి ‘క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్’ అవార్డు లభించింది. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి అనుపమ్ ఖేర్ ‘మోస్ట్ వెర్సెటైల్ యాక్టర్‌’గా ఎంపికయ్యారు. ఇంకా సీనియర్ నటీమణి రేఖను చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను సత్కరించారు.

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2023 విజేతల పూర్తి జాబితా ఇదే..

  • ఉత్తమ చిత్రం: ది కాశ్మీర్ ఫైల్స్
  • ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: ఆర్ఆర్ఆర్
  • ఉత్తమ దర్శకుడు: ఆర్ బాల్కీ చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్
  • ఉత్తమ నటుడు: రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్రా: పార్ట్ 1
  • ఉత్తమ నటి: అలియా భట్ – గంగూబాయి కతియావాడి చిత్రం
  • మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి – కాంతారా చిత్రం
  • ఉత్తమ వెబ్ సిరీస్: రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్
  • విమర్శకుల ఉత్తమ నటుడు: వరుణ్ ధావన్ – భేదియా చిత్రం
  • టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్: అనుపమ
  • మోస్ట్ వెర్సెటైల్ యాక్టర్‌: అనుపమ్ ఖేర్ – ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం
  • ఉత్తమ సహాయ నటి: షీబా చద్దా – డాక్టర్ జి
  • ఒక వెబ్ సిరీస్‌లో ఉత్తమ నటుడు: జిమ్ సర్భ్ – రాకెట్ బాయ్స్
  • వెబ్ సిరీస్‌లో ఉత్తమ నటి: షెఫాలీ షా – ఢిల్లీ క్రైమ్ సీజన్ 2
  • టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటుడు: జైన్ ఇమామ్ – ఫనా- ఇష్క్ మే మార్జవాన్
  • ఉత్తమ గాయకుడు: సచేత్ టాండన్ – మయ్య మైను పాట
  • ఉత్తమ మహిళా గాయని: నీతి మోహన్ – మేరీ జాన్ చిత్రం
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్: పిఎస్ వినోద్ – విక్రమ్ వేద చిత్రం
  • ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు: దుల్కర్ సల్మాన్ – చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్
  • ప్రతికూల పాత్రలో ఉత్తమ నటి: బ్రహ్మాస్త్రానికి మౌని రాయ్: మొదటి భాగం – శివ
  • సంగీత పరిశ్రమలో అత్యుత్తమ సేవలందించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2023: హరిహరన్
  • చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమ సహకారం అందించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2023: నటి రేఖ

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − one =