ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు: సిసోడియా అరెస్ట్‌ వ్యవహారంలో సీబీఐపై సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

Delhi Liquor Scam Case Cm Kejriwal Interesting Comments On Cbi Over Deputy Cm Manish Sisodias Arrest, Delhi Liquor Scam Case, Cm Kejriwal Interesting Comments On Cbi, Deputy Cm Manish Sisodias Arrest, Kejriwal Comments Over Delhi Liquor Scam Case, Mango News, Mango News Telugu,Manish Sisodia Whatsapp Number,Aap Liquor Policy,Delhi Alcohol,Delhi Deputy Cm Manish Sisodia,Delhi Deputy Cm Manish Sisodia Contact Number,Delhi Liquor News,Delhi Liquor Policy Case,Deputy Cm Manish Sisodia Contact Number,Deputy Cm Of Delhi Contact Details,Deputy Cm Of Mumbai,Liquor Gate Scandal,Manish Sisodia Cast,Manish Sisodia Contact Number,Manish Sisodia Daughter,Manish Sisodia Education Minister,Meer Sisodia,New Excise Policy Delhi,Who Is Deputy Cm Of Delhi,Who Is Manish Sisodia Wife

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ కేసులో సిసోడియా ప్రమేయం ఏమాత్రం లేదని, కావాలనే ఆయనను ఈ కేసులో ఇరికించారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే సీఎం కేజ్రీవాల్ సీబీఐపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. లిక్కర్ పాలసీ విచారణలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేయడాన్ని చాలా మంది సీబీఐ అధికారులు వ్యతిరేకిస్తున్నారని నాకు తెలిసింది. వారందరికీ అతనిపై అపారమైన గౌరవం ఉంది మరియు అతనిపై ఎటువంటి ఆధారాలు లేవు. అయితే ఆయనను అరెస్టు చేయాలనే రాజకీయ గురువుల ఒత్తిళ్ల కారణంగానే ఆధారాలు లేకుండా బలవంతంగా అలా చేయవలసి వచ్చింది’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

కాగా ఢిల్లీ రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో మరియు అమలు చేయడంలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఈ కేసులో ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఆదివారం మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన చర్యలలో ఇది సంచలనం కలిగించే పరిణామంగా మారింది. ఇక అంతకుముందు ఆప్ మద్దతుదారులతో రోడ్‌షో నిర్వహించి, ఆప్ పురోగతికి బిజెపి భయపడుతున్నందున తనను నకిలీ కేసులో ఇరికించారని అన్నారు. ఇక దీనిపై విచారణ జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ మరియు ఈడీలు పలువురు ప్రముఖుల పేర్లను పేర్కొంటూ చార్జిషీట్స్ కూడా దాఖలు చేశాయి. ఇక కేసులో ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలను, ప్రముఖులను అరెస్ట్ చేసిన కేంద్ర ఏజెన్సీలు మనీష్ సిసోడియా అరెస్టుతో తాజాగా మరో అడుగు ముందుకేసాయి. కాగా సిసోడియాను ఐదు రోజుల రిమాండ్ కోరిన సీబీఐ వినతిపై కోర్టు ఆర్డర్ రిజర్వ్ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 3 =