జూన్ 30 వరకు అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు

DGCA Extends International Commercial Passenger Flight Services Ban Till June 30, Ban on International Passenger Flights, Ban on International Passenger Flights Extended, COVID-19 Impact, Directorate General of Civil Aviation, India Extends Ban On International Flights, India extends ban on international flights till June, India Extends International Flight Ban, India Extends International Passenger Flights Ban, India Extends International Passenger Flights Ban Till June 30, international passenger flights, International Passenger Flights Ban, Mango News, Union Civil Aviation Ministry

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుండగా, తాజాగా ఆ నిషేధం గడువును జూన్ 30 వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. కమర్షియల్‌ ప్యాసింజర్‌ విమానాలపై నిషేధం విధిస్తూ జూన్ 26, 2020 న ఇచ్చిన ఉత్తర్వులకు పాక్షిక సవరణ చేస్తూ జూన్ 30 అర్ధరాత్రి 23.59 గంటల వరకు విమాన సర్వీసులపై నిషేధం విధిస్తునట్లుగా డీజీసీఏ శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అంతర్జాతీయ కార్గో విమాన సేవలకు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించే విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు. అయితే సమర్థ అధికారం ఆధారంగా ఎంపిక చేసిన కొన్ని రూట్లు/దేశాలకు విమాన సర్వీసులు కొనసాగించే అవకాశం ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 17 =