కరోనాకు అధిక బిల్లుల వసూలుపై 64 ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ

Covid Treatment, Covid Treatment Licenses, Five Hyderabad hospitals barred from Covid treatment, Five Private Hospitals Lose Permission to Treat Covid-19, Hospitals Violating Treatment Protocols, Licenses Cancelled for Hospitals Violating Treatment Protocols, Mango News, Telangana Govt, Telangana Govt Cancelled Covid Treatment Licenses, Telangana Govt Cancelled Covid Treatment Licenses of 5 Hospitals, Telangana Govt Cancelled Covid Treatment Licenses of 5 Hospitals for Violating Treatment Protocols, Treatment Protocols

కరోనా చికిత్సలో భాగంగా బాధితుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అధిక ఫీజులు వసూలు చేయడంపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, దర్యాప్తు అనంతరం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు హైదరాబాద్‌ లోని 5 ఆసుపత్రుల కరోనా చికిత్స లైసెన్స్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రద్దు చేసింది.

బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రి, బేగంపేటలోని విన్‌ ఆసుపత్రి, కాచిగూడలోని టీఎక్స్‌ ఆసుపత్రి, కేపీహెచ్‌బీలోని మ్యాక్స్‌ హెల్త్‌ ఆసుపత్రి మరియు మోతీనగర్‌లోని నీలిమ ఆసుపత్రుల కరోనా చికిత్స లైసెన్సులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా వీటిల్లో విరించి ఆసుపత్రి కరోనా చికిత్స లైసెన్స్ ర‌ద్దు కావడం ఇది రెండోసారి. మరోవైపు కరోనా చికిత్సకు అధిక ఫీజుల వసూళ్లపై ప్ర‌జ‌ల నుంచి అందిన ఫిర్యాదుల మేర‌కు మొత్తం 64 ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య‌శాఖ‌ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న ఆసుపత్రులివే :

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 14 =