Agni-P క్షిపణి ప్రయోగం విజయవంతం – DRDO

Agni-P missile, DRDO, DRDO successfully conducts second flight test of Agni P missile, DRDO Successfully Flight Tested Nuclear, DRDO Successfully Flight Tested Nuclear Capable Agni-P missile, flight test of Agni P missile, India successfully test fires nuclear-capable Angi P, India successfully test-fires new generation Agni Prime missile, Mango News, Mango News Telugu, new generation Agni Prime missile, New generation ballistic missileAgni P successfully test-fired, Nuclear-capable Agni-P missile successfully flight tested

భారత్ తన సార్వభౌమత్వాన్ని, ఉనికిని కాపాడుకునే క్రమంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. దేశ భద్రత విషయంలో అత్యంత సమర్ధవంతంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతోంది. తాజాగా, భారత రక్షణ ఆయుధ కర్మాగార సంస్థ.. డిఫెన్స్​ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్​ ఆర్గనైజేషన్​ (DRDO) మరో విజయం సాధించింది. సరికొత్త జనరేషన్​ బాలిస్టిక్​ మిస్సైల్​ ‘అగ్ని-పి’ని విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్ నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో​ చేరుకున్నట్లు డీఆర్​డీఓ తెలిపింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్​ కలామ్​ ఐలాండ్​లో ఈ రోజు (శనివారం, డిసెంబర్ 18) ఈ మిస్సైల్​ను విజయవంతంగా పరీక్షించినట్లు వివరించింది. తాజా పరీక్షల్లో ఈ వ్యూహాత్మక క్షిపణి ఫలితాలు ఆశించిన స్థాయిలో వచ్చినట్లు పేర్కొంది.

అగ్ని-పి క్షిపణి ప్రత్యేకత

భారతదేశ అణు ప్రయోగ సామర్థ్యానికి నిలువెత్తు ప్రతీకలు ఈ ‘అగ్ని’ ఆయుధాలు. వీటిలో ‘పృథ్వి’ వంటి స్వల్ప శ్రేణి బాలిస్టిక్​ క్షిపణులతోపాటు జలాంతర్గాములు, ఫైటర్ జెట్ విమానాలు కూడా ఉన్నాయి. 5 వేల కిలో మీటర్ల పైచిలుకు లక్ష్యాన్ని సైతం చేధించగల సామర్థ్యం ఉన్న  క్షిపణులు కూడా ‘అగ్ని’ శ్రేణిలో ఉన్నాయి. ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈ ‘అగ్ని-పి’ క్షిపణి కూడా వాటి సరసన చేరింది. దీని సామర్థ్యం 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది రెండు దశల కానిస్ట్రేటెడ్ సాలిడ్-ప్రొపెలెంట్ బాలిస్టిక్ మిసైల్​ కావడం గమనార్హం. తాజాగా ప్రయోగించిన మిస్సైల్​ అన్ని అంచనాలను అత్యంత కచ్చితత్వంతో అందుకున్నట్లు తెలిపింది భారత రక్షణ శాఖ. ఈ సందర్భంగా డీఆర్​డీఓకు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సరికొత్త మిస్సైల్ పనితీరుపైనా ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + two =