సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ కు కేఎల్ రాహుల్ ఔట్, కెప్టెన్ గా రిషబ్ పంత్‌ నియామకం

India-South Africa T20 Series KL Rahul and Kuldeep Yadav Ruled Out Rishabh Pant to Lead Team India, KL Rahul and Kuldeep Yadav Ruled Out, Rishabh Pant to Lead Team India, India-South Africa T20 Series, T20 Series, India-South Africa, Kuldeep Yadav, KL Rahul, Rishabh Pant, India, South Africa, IND vs SA, India-South Africa T20I Series, IND vs SA T20I Series News, IND vs SA T20I Series Latest News, IND vs SA T20I Series Latest Updates, IND vs SA T20I Series Live Updates, Mango News, Mango News Telugu,

భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల​ మధ్య స్వదేశంలో జూన్ 9, 12, 14, 17, 19వ తేదీల్లో 5 టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే సౌత్ ఆఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ లో తలపడే 18 మందితో కూడిన భారత్ ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఈ టీ20 సిరీస్‌ కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా, రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించారు. అయితే టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ రైట్ గ్రోయిన్ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడని బీసీసీఐ బుధవారం నాడు ప్రకటించింది. దీంతో ఈ టీ20 సిరీస్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా మరియు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా మంగళవారం సాయంత్రం నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని కుడి చేతికి దెబ్బ తగలడంతో సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడని తెలిపారు.

కాగా సెలక్షన్ కమిటీ కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్‌ల స్థానంలో కొత్తగా ఎవరిని ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. ఈ ఇద్దరు క్రికెటర్లు ఇప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేస్తారని, అక్కడ వైద్య బృందం వారిని మరింత పరీక్షించి, భవిష్యత్తు చికిత్సపై నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.

సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం భారత్ టీ20 జట్టు: రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్)(వికెట్కీపర్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవిబిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =