మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో రూ.1,42,095 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు

GST Revenue Collection All Time High Gross GST of Rs 142095 Cr Reported in March Month, All Time High Gross GST of Rs 142095 Cr Reported in March Month, GST Revenue Collection, Revenue Collection, 142095 Cr Reported in March Month, gross GST collection in March 2022, GST collections in March, GST collections, Govt revenue goes up, 2022 gross GST collection in March, GST collections Latest News, GST collections Latest Updates, Mango News, Mango News Telugu,

దేశంలో మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. మార్చి నెలలో మొత్తం రూ.1,42,095 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని, 2022 జనవరి నెలలో వసూలైన రూ.1,40,986 కోట్లను దాటి జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇంత భారీగా వసూలు కావడం ఇదే తొలిసారని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే మార్చి 2022లో నమోదైన జీఎస్టీ వసూళ్లు 2021 మార్చి కంటే 15% ఎక్కువని మరియు మార్చి 2020లో జీఎస్టీ రాబడి కంటే 46% ఎక్కువని పేర్కొన్నారు.

మార్చిలో సీజీఎస్టీ వసూళ్లు రూ.25,830 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ.32,378 కోట్లు, ఐజీఎస్టీ రూ.74,470 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.39,131 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి రూ.9,417 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ. 981 కోట్లతో కలిపి) గా నమోదయ్యాయి. ఆర్థిక పునరుద్ధరణ, ఎగవేత నిరోధక కార్యకలాపాలు, ముఖ్యంగా నకిలీ బిల్లర్లపై చర్యలు మెరుగైన జీఎస్టీ వసూళ్లకి దోహదం చేస్తున్నాయి. ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిచేయడానికి జీఎస్టీ కౌన్సిల్ చేపట్టిన వివిధ రేట్ల హేతుబద్ధీకరణ చర్యల వలన కూడా ఆదాయంలో మెరుగుదల కనిపించిందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =