గర్భిణీకి పిండం లివర్‌లో పెరుగుతుంది – కెనడాలో విచిత్రం

baby discovered inside woman’s liver, Baby discovered inside woman’s liver in a rare ectopic, Canada, Canadian woman carries foetus inside liver, Canadian woman had a fetus growing in her LIVER, Doctors find foetus inside Canadian woman’s liver, ectopic Pregnancy, Foetus Found Inside Woman’s Liver, Foetus Found Inside Woman’s Liver Of Extremely Rare Pregnancy, Foetus Found Inside Woman’s Liver Of Extremely Rare Pregnancy In Canada, foetus grows inside woman’s liver in Canada, Mango News

సాధారణంగా మానవ శరీరం భౌతిక, రసాయనిక చర్యల సంయోగ మిళితంగా రూపొందుతుంది. జీవక్రియలు ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతుంటాయి. కానీ, ఒక్కొక్కసారి శరీర నిర్మాణ క్రమంలో ఏవైనా అనూహ్య పరిణామాలు జరిగినప్పుడు అది స్పందించే విధానంలో కూడా తేడాగా ఉంటుంది. ఒక్కోసారి ఇది విపరీత పరిస్థితులకు దారితీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో వైద్యులు కూడా ఆశ్చర్యచకితులు అవుతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక వాళ్లు కూడా తలలు పట్టుకుంటుంటారు. అలాంటి సందర్భమే ఒకటి ఇటీవల కెనడాలోని వైద్యులకు ఎదురయింది. షాకింగ్ కేసు ఒకటి వారి ముందుకు వచ్చింది. వివరాలలోకి వెళ్తే…

ఈ మధ్య కెనడా దేశంలో, 33 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ గర్భం దాల్చింది. ఈమె గర్భం దాల్చిన 49 రోజుల తర్వాత ఆసుపత్రికి వచ్చి సోనోగ్రఫీ చేయించుకుంది. ఇందులో వైద్యులకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. సాధారణంగా పిండం స్త్రీ గర్భంలో అభివృద్ధి చెందుతుంది. కానీ, ఈ మహిళకు మాత్రం స్కానింగ్ లో పిండం ఆమె కాలేయంలో ఉన్నట్లు కనిపించింది. దీంతో ఆ మహిళకు ఎక్టోపిక్ గర్భం ఉందని వైద్యులు చెప్పారు. ఈ విచిత్రమైన గర్భధారణ వల్ల చాలా సమస్యలు వస్తాయి. వైద్యులు ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించారు. ఈ సందర్భంలో మహిళను కాపాడవచ్చు. కానీ కాలేయంలో పెరుగుతున్న బిడ్డ జీవితాన్ని కాపడలేమని వైద్యులు చెప్పారు. చివరకు అదే జరిగింది.. వైద్యులు ఆపరేషన్ ద్వారా ఆ మహిళ ప్రాణాలను కాపాడగలిగారు కానీ పిండాన్ని రక్షించడంలో విఫలమయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 3 =