మే 2న ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ కేంద్రాల వద్ద నిబంధనలపై ఈసీ ఆదేశాలు

Broad Guidelines for Conduct of General Elections, Broad Guidelines for Covid Safety, EC issues guidelines on polls during pandemic, ECI Issues Broad Guidelines for Covid Safety, ECI Issues Broad Guidelines for Covid Safety During Counting of Votes, ECI Issues Broad Guidelines for Covid Safety During Counting of Votes on May 2nd, Election Commission issues Broad Guidelines, Election Commission of India, Mango New

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశంలో పశ్చిమబెంగాల్‌, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో సహా శాసనసభ కలిగిన కేంద్రపాలితమైన పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ మే 2న జరగనున్న సంగతి తెలిసిందే. వీటితో పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు ఫలితాలు కూడా మే 2 న వెలువడనున్నాయి. ఇప్పటికే మే 2 విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ప్రకటించగా, తాజాగా ఓట్ల లెక్కింపు పక్రియ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు ఇవే:

  • ప్రతి కౌంటింగ్ సెంటర్‌లో డిఇఒ నోడల్ ఆఫీసర్‌గా ఉండాలి, నోడల్ హెల్త్ ఆఫీసర్ సహాయంతో కౌంటింగ్ కేంద్రాలు వద్ద కోవిడ్-19 సంబంధిత నిబంధనలు అమలయ్యేలా చూడాలి.
  • ఆర్టీపీసీఆర్/ర్యాపిడ్ యాంటీజెన్ నెగటివ్ రిపోర్టు లేదా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ పొందిన ధ్రువ పత్రాన్ని సమర్పించకుండా కౌంటింగ్ హాల్ లోపలకి అభ్యర్థులు/ఏజెంట్లను అనుమతించకూడదు.
  • ఆర్టీపీసీఆర్/ర్యాపిడ్ యాంటీజెన్ రిపోర్టులు కౌంటింగ్ ప్రక్రియకు 48 గంటలలోపు పొందినవై ఉండాలి.
  • కౌంటింగ్ రోజుకు ముందు అభ్యర్థులు/కౌంటింగ్ ఏజెంట్లకు ఆర్టీపీసీఆర్/ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేసేలా డిఈఓ ఏర్పాట్లు చేయాలి.
  • అభ్యర్థులు లెక్కింపు రోజుకు మూడు రోజుల ముందు కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను సమర్పించాలి.
  • కౌంటింగ్ కేంద్రాల వెలుపల బహిరంగ సభలు అనుమతించబడవు.
  • భౌతిక దూరం పాటించేలా కౌంటింగ్ హాల్ తగినంత పెద్దదిగా ఉండాలి మరియు సరైన వెంటిలేషన్, కిటికీలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి.
  • కౌంటింగ్ కేంద్రాలలో కౌంటింగ్ కు ముందు, కౌంటింగ్ జరిగే సమయంలో మరియు కౌంటింగ్ తరువాత శానిటైజ్ చేయాలి.
  • సీల్ చేసి ఉన్నఈవీఎం/ వీవీపాట్ లను కూడా శానిటైజ్ చేయాలి.
  • కౌంటింగ్ హాల్/రూమ్/ప్రాంగణ ప్రవేశం వద్ద అందరికి థర్మల్ స్కానింగ్ నిర్వహించబడుతుంది.
  • శానిటైజర్, సబ్బు మరియు నీరు అందుబాటులో ఉండాలి మరియు హాలులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ చేతిని శుభ్రపరుచుకోవాలి.
  • జ్వరం, జలుబు మొదలైన కోవిడ్-19 యొక్క లక్షణాలు ఉన్న ఎవరికీ కూడా కౌంటింగ్ హాల్‌లో ప్రవేశించడానికి అనుమతి ఉండదు.
  • రిపోర్ట్ పాజిటివ్ గా వస్తే అభ్యర్థి కౌంటింగ్ ఏజెంట్లను కొత్తగా నియమించవచ్చు లేదా భర్తీ చేయవచ్చు.
  • కౌంటింగ్ హాల్, సీటింగ్ లోపల భౌతిక దూరం నిర్వహించబడుతుంది.
  • కౌంటింగ్ కోసం తగినంత సంఖ్యలో పిపిఇ కిట్స్ ఉండాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + three =