ఏపీలో కొత్త జిల్లా అధ్యక్షులు మరియు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించిన వైయస్ఆర్‌సీపీ, జాబితా ఇదే

YSRCP Appoints New District Presidents and Regional Coordinators in AP,YSRCP New District Presidents,YSRCP Regional Coordinators,YSRCP AP,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తగా జిల్లా అధ్యక్షులు మరియు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించింది. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలతో పాటు పలువురు మంత్రులకు ఈ పదవులు అప్పగించింది. ఈ క్రమంలో పార్టీలోని కీలకమైన జిల్లా అధ్యక్షులు మరియు ప్రాంతీయ సమన్వయకర్తలుగా కొత్తవారిని నియమించింది. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం అధికారికంగా ప్రకటించింది.

వైయస్ఆర్‌సీపీ అనుబంధ శాఖల సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఆయన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త మరియు ప్రధాన కార్యదర్శి అయిన వి.విజయసాయి రెడ్డికి సహాయకుడిగా వ్యవహరిస్తారని పేర్కొంది. ఈ సందర్భంగా చెవిరెడ్డి స్పందిస్తూ.. పార్టీకి చెందిన 23 అనుబంధ సంఘాల రాష్ట్ర సమన్వయకర్తగా అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రేయింబవళ్లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రతి అనుబంధ శాఖను పటిష్టం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన తెలిపారు.

వైయస్ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తల జాబితా..

  • శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల సమన్వయకర్త – బొత్స సత్యనారాయణ.
  • విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల సమన్వయకర్త – వైవీ సుబ్బారెడ్డి.
  • కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల సమన్వయకర్తలు – పిల్లి సుభాష్ మరియు మిథున్ రెడ్డి.
  • కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల సమన్వయకర్తలు – మర్రి రాజశేఖర్‌, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి.
  • పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల సమన్వయకర్తలు – బీద మస్తాన్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి.
  • నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల సమన్వయకర్త – బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.
  • అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల సమన్వయకర్త – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
  • కర్నూలు, నంద్యాల జిల్లాల సమన్వయకర్త – అమర్‌నాథ్ రెడ్డి.

జిల్లా అధ్యక్షుల జాబితా..

  • శ్రీకాకుళం – ధర్మాన కృష్ణదాస్.
  • విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు.
  • పార్వతీపురం మన్యం – పరీక్షిత్ రాజు.
  • అల్లూరి సీతారామరాజు – కోటగుళ్ల భాగ్యలక్ష్మి.
  • విశాఖపట్నం- పంచకర్ల రమేష్.
  • అనకాపల్లి – కరణం ధర్మశ్రీ.
  • కాకినాడ – కురసాల కన్నబాబు.
  • డా.అంబేడ్కర్ కోనసీమ – పొన్నాడ సతీష్
  • తూ. గోదావరి – జక్కంపూడి రాజా.
  • ప.గోదావరి – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
  • ఏలూరు – ఆళ్ల నాని.
  • కృష్ణా – పేర్ని నాని.
  • ఎన్టీఆర్ – వెల్లంపల్లి శ్రీనివాస్.
  • గుంటూరు – డొక్కా మాణిక్య వరప్రసాద్.
  • బాపట్ల – మోపిదేవి వెంకటరమణ.
  • పల్నాడు – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
  • ప్రకాశం – జంకె వెంకటరెడ్డి.
  • నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
  • కర్నూలు – బీవై రామయ్య.
  • నంద్యాల – కాటసాని రాంభూపాల్ రెడ్డి.
  • అనంతపురం – పైలా నరసింహయ్య.
  • శ్రీసత్యసాయి – మాలగుండ్ల శంకరనారాయణ.
  • వైయస్ఆర్‌ కడప – కొత్తమద్ది సురేష్ బాబు.
  • అన్నమయ్య – గడికోట శ్రీకాంత్ రెడ్డి.
  • చిత్తూరు – కే నారాయణ స్వామి.
  • తిరుపతి – నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =