అయోధ్యలో రామ మందిరం 2024, జనవరి 1 నాటికి సిద్ధమవుతుంది – కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Union Home Minister Amit Shah Says Ram Mandir Will be Ready by January 1 2024,Union Home Minister Amit Shah,Ram Mandir January 1 2024,Ram Mandir Opening,Mango News,Mango News Telugu,Ram Mandir Construction,Ram Mandir Ayodhya Location,Ayodhya Shri Ram Mandir,Ayodhya Ram Mandir News And Updates,Ayodhya Ram Mandir History,Ayodhya Ram Mandir Donation Online,Ayodhya Ram Mandir Donation,Ayodhya Ram Mandir Current Status,Ayodhya Ram Mandir Construction Status,Ayodhya Ram Mandir Construction,Ayodhya New Ram Mandir,Ayodhya Ka Ram Mandir

అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 2020, ఆగస్టు 5న అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ మందిరం ప్రారంభంపై గురువారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అయోధ్యలో రామ మందిరం 2024, జనవరి 1 నాటికి సిద్ధమవుతుందని అమిత్ షా తెలిపారు. గురువారం త్రిపురలో పర్యటించిన అమిత్ షా బీజేపీ చేపట్టే 8 రోజుల రథయాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా అమిత్ షా విలేకరులతో మాట్లాడుతూ, రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ కోర్టుల్లో అడ్డుకుందని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారని అన్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మేము ఆలయాన్ని నిర్మిస్తాము, కానీ తేదీ చెప్పము అని చెప్పారని అమిత్ షా అన్నారు. అయితే 2024, జనవరి 1న అయోధ్యలో ప్రజల కోసం భారీ మరియు ఆకాశమంత ఎత్తైన ఆలయం సిద్ధంగా ఉంటుందని అనే విషయాన్ని రాహుల్ గాంధీ మరియు ప్రతి ఒక్కరూ వినాలని అన్నారు. అలాగే వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా ప్రకటించారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 5 =