జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో కిసాన్‌ పరేడ్ నిర్వహిస్తాం: రైతు సంఘాలు

Farmer Unions Announced that Tractor Kisan Parade, Farmer unions planning tractor parade, Farmer unions planning tractor parade on Republic Day, Farmers Protest, Farmers Protest In India, Farmers Protest LIVE Updates, Kisan Parade, Mango News Telugu, Parallel to Republic Day parade, Republic Day, Republic Day Parade, Tractor Kisan Parade

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 39 వ రోజుకు చేరుకుంది. ఇటీవల కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు కూడా పూర్తిస్థాయిలో ఫలప్రదం కాలేదు. ఈ నేపథ్యంలో మరో దశ చర్చలకు ముందే రైతు సంఘాల నేతలు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. జనవరి 26 వ తేదీలోగా రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే, గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ నిర్వహిస్తామని స్వరాజ్‌ ఇండియా చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు.

ట్రాక్టర్లు, ట్రాలీలు మరియు ఇతర వాహనాలతో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పరేడ్ నిర్వహిస్తామని, వీలైతే రాజధాని ఢిల్లీ ప్రక్క ప్రాంతాల రైతుల ఈ పరేడ్ లో పాల్గొనేందుకు ప్రతి రైతు కుటుంబం నుంచి ఒక సభ్యుడిని ఢిల్లీకి పంపేందుకు ప్రయత్నం చేయాలని అభ్యర్థిస్తున్నామని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మరోవైపు జనవరి 23న వివిధ రాష్ట్రాల్లోని గవర్నర్ నివాసాల వైపు పరేడ్ నిర్వహిస్తామని క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =