దేశంలో మొదటిదశలో 3 కోట్ల మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ

coronavirus news, Coronavirus News Updates, coronavirus vaccine, Coronavirus Vaccine In India, Coronavirus Vaccine News, Coronavirus Vaccine Updates, COVID 19 Vaccine, Covid-19 Vaccine Free for 3 Crore Health and Frontline Workers, Covishield Vaccince, Covishield Vaccince In India, Mango News Telugu, Union Minister Harsh Vardhan

దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో జనవరి 2, శనివారం నాడు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ డ్రైరన్ (వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఢిల్లీలో పలు ప్రదేశాల్లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన 1 కోటి ఆరోగ్య కార్యకర్తలు మరియు 2 కోట్ల ఫ్రంట్‌లైన్ వారియర్స్ కు మొదటిదశలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఉచితంగా అందించబడుతుంది. అలాగే ఈ ఏడాది జూలై వరకు ఇంకా 27 కోట్ల మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ వేయడం ఎలా అనే వివరాలు ఖరారు చేయబడుతున్నాయి” అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ‌-ఆస్ట్రాజెనికా సౌజన్యంతో “కోవిషిల్డ్” పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ శుక్రవారం నాడు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ ఉచిత పంపిణీపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అతిత్వరలోనే దేశంలో మొదటివిడత కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమయ్యే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =