ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు

Arun Jaitley Stadium, Feroz Shah Kotla Stadium In Delhi, Feroz Shah Kotla Stadium In Delhi to be renamed as Arun Jaitley Stadium, Feroz Shah Kotla Stadium to be renamed as Arun Jaitley, Feroz Shah Kotla Stadium to be renamed as Arun Jaitley Stadium, Latest National Political News Today, Mango News Telugu, national political news, National Political News 2019, National Political News Today, national political updates

ఢిల్లీలోని ప్రఖ్యాత ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టాలని డీడీసీఏ నిర్ణయించుకుంది. గతంలో అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా వ్యవహరించారు. బీసీసీఐ లోను కీలక పదవులు నిర్వహించి, క్రికెట్ కి సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ క్రికెట్ కు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ఎంతో కృషి చేసిన దివంగత అరుణ్ జైట్లీ కి సరైన గౌరవం ఇవ్వాలని డీడీసీఏ నిర్ణయించుకుంది. ఇకపై ఫిరోజ్ షా కోట్లా స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చనున్నారు. ఈ పేరు మార్చే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 12న నిర్వహించనున్నారు. అదే విధంగా స్టేడియంలో ఒక స్టాండ్ కి ప్రస్తుత భారతజట్టు కెప్టెన్, స్టార్ బాట్స్ మెన్ విరాట్ కోహ్లీ పేరు పెట్టనున్నారు.

డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, డీడీసీఏ అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ పనిచేసిన కాలంలో అత్యాధునిక సౌకర్యాలుతో కోట్లా స్టేడియాన్ని పునరుద్ధరణ చేసారని చెప్పారు. స్టాండ్ల నిర్మాణం, డ్రెస్సింగ్ రూముల నిర్మాణం వంటి అనేక ఆధునీకరణ అంశాలు జైట్లీ ఆధ్వర్యంలోనే జరిగాయని చెప్పారు. గౌతమ్ గంభీర్, వీరేందర్ సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, ఆశిష్ నెహ్రా, రిషబ్ పంత్ వంటి అనేక మంది క్రీడాకారులు దేశం గర్వించేలా చేసారంటే జైట్లీ మద్ధతు ఒక కారణమని చెప్పారు. పేరు మార్పు సందర్భంగా ఏర్పాటు చేయనున్న కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=6sLR9no38zk]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 7 =