ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్- టాప్ 10లో బుమ్రా

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, ICC Test rankings, ICC Test rankings 2019, ICC Test Rankings 2019-Jasprit Bumrah breaks into top ten, ICC Test Rankings For Batsmen, ICC Test Rankings For Batsmen 2019, Jasprit Bumrah breaks into top ten, latest sports news, latest sports news 2019, Mango News, Mango News Telugu, sports news

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో భారత పేస్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా ఏడో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ తో జరిగిన తొలిటెస్టులో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన తరువాత బుమ్రా ఒకేసారి తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకుని 774 పాయింట్స్ తో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో బుమ్రా తొలిసారి టాప్-10 లోకి చేరుకున్నాడు. ఆకట్టుకునే బౌలింగ్ తో టెస్టుల్లో వేగంగా 50 వికెట్లు సాధించిన భారత బౌలర్ గా బుమ్రా ఇటీవలే ఘనత సాధించాడు. ఇక బ్యాట్స్‌మెన్‌ జాబితాలో భారత స్టార్ బ్యాట్స్‌మెన్‌ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమ్మిన్స్ 908 రేటింగ్ పాయింట్స్ తో అగ్రస్థానంలో ఉండగా, సౌత్ ఆఫ్రికా బౌలర్ కసిగో రబడ 851 పాయింట్స్ తో, ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్‌ 814 పాయింట్స్ తో రెండు, మూడవ స్థానాల్లో ఉన్నారు. ఇక మరో భారత బౌలర్ రవీంద్ర జడేజా పదో స్థానంలో నిలిచాడు. టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌, చటేశ్వర పుజారా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారు. వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన అజింక్య రహానే 10 స్థానాలు మెరుగుపరుచుకుని 11వ ర్యాంకుకు చేరుకున్నాడు. యాషెస్ సిరీస్ లో మూడో టెస్టులో తన ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ కు సంచలన విజయం అందించిన బెన్‌ స్టోక్స్‌ ఆల్ రౌండర్స్ జాబితాలో రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here