ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

PM Narendra Modi Pays Tributes To Chhatrapati Shivaji Maharaj On his Jayanti

దేశ‌వ్యాప్తంగా మరాఠా సామ్రాజ్యపు యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ జ‌యంతి (ఫిబ్రవరి 19) వేడుక‌లు ఘ‌నంగా జ‌రుతున్నాయి. ఈ నేపథ్యంలో ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ కు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ “ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ఆయన జయంతి సందర్భంగా నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. స‌ర్వోత్కృష్టమైన ఆయన నాయకత్వం మరియు సామాజిక సంక్షేమానికి ఆయన అగ్రతాంబూలాన్ని కట్టబెట్టడం అనేటటువంటి అంశాలు ప్రజలకు తరాల తరబడి ప్రేరణను అందిస్తూ వస్తున్నాయి. సత్యం మరియు న్యాయం అనే విలువల కోసం నిలబడడంలో రాజీ పడడం అనేది ఆయన ఎరుగనే ఎరుగరు. ఆయన కన్న కలలను నెరవేర్చడానికి మేం కంకణం కట్టుకొన్నాం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్ధిక శాఖల మంత్రి ట్వీట్ చేస్తూ “కులమతాలకు అతీతంగా యావత్ దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి శుభాకాంక్షలు. యుద్దాలు చేసినా అహింస, కక్షపూరిత దాడులు, విధ్వంసాలను ప్రోత్సహించకుండా, ఓడిన రాజ్య ప్రజలను సైతం ఎంతో అపురూపంగా పాలించిన శివాజీ, పరిపాలనలో సైతం జనరంజక విధానాలతో ప్రజల మన్ననలు పొందాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడంలో సీఎం కేసీఆర్ కు చత్రపతి శివాజీ జీవితం స్పూర్తిగా నిలిచింది. శివాజీ మార్గంలో అహింసా రీతిలో పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించి, ప్రజల కోసమే పాలకులు అన్న సూత్రాన్ని పాటిస్తూ సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారు” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =