సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో కొత్త ఇసుక పాలసీ

AP CM YS Jagan Conducts Review Meeting, AP CM YS Jagan Conducts Review Meeting Over Spandana Program, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, CM YS Jagan Conducts Review Meeting, CM YS Jagan Conducts Review Meeting Over Spandana Program, Mango News Telugu, YS Jagan Conducts Review Meeting Over Spandana Program

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఇసుక విధానంపై కీలక ప్రకటన చేసారు. సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీ అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇసుక సరఫరా వెంటనే పెంచాలని, లేకుంటే ధరలు తగ్గవని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో అమలవుతున్న ధర కంటే తక్కువకే ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లు తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇసుక సరఫరా పై సూచనలు చేసారు. గుర్తించిన స్టాక్ యార్డుల్లో ఇసుక నింపడం మొదలు పెట్టాలని, అవకాశమున్న ప్రతిచోటా రీచ్ లను పెంచాలని తెలిపారు. ఇసుక రవాణా విషయంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, ఎక్కువమందికి అవకాశం ఇవ్వాలని సీఎం వై.ఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

ఈ విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారని, వారిని ఎలా అడ్డుకోవాలో తెలుసునని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా పధకం, చేనేత కుటుంబాలకు సహాయం, అమ్మఒడి పధకం, ఇళ్ల నిర్మాణం, వైఎస్సార్ పెళ్లికానుక, మత్స్యకార్మికులకు సహాయం, సొంత ఆటో టాక్సీ డ్రైవర్లకు ప్రోత్సాహకాలు, అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు లాంటి అనేక అంశాలపై సీఎం జగన్ సంబంధిత శాఖ మంత్రులు, ఉన్నతధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

[subscribe]
[youtube_video videoid=kHx8_c4bSbg]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =