కోవిడ్ ఇంకా ముగియలేదు, అన్ని ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉండాలని అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు

PM Modi Chaired High-level Meeting to Assess Covid-19 Situation in the Country,Covid Is Not Over Yet, Pm Modi Orders Officials,Ready With All Arrangements For Covid,Mango News,Mango News Telugu,COVID Outbreak,COVID Outbreak Latest News and Updates,COVID Outbreak News and Live Updates,Indian Medical Association News and Updates,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

దేశంలో కోవిడ్-19 పరిస్థితి, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ యొక్క సంసిద్ధత, కోవిడ్ వ్యాక్సినేషన్ యొక్క స్థితి మరియు కొత్త కోవిడ్-19 వేరియంట్స్, దేశంలో ప్రజలపై వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కొన్ని దేశాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు దేశాలలో పెరుగుతున్న కేసులతో సహా గ్లోబల్ కోవిడ్-19 పరిస్థితికి సంబంధించి సమగ్ర ప్రదర్శనను అధికారులు అందించారు. సగటు రోజువారీ కేసుల సంఖ్య 153కి పడిపోవడంతో లో దేశంలో కోవిడ్ క్రమంగా తగ్గుముఖం పడుతోందని ప్రధానికి వివరించారు. 2022, డిసెంబర్ 22 తో ముగిసే వారంలో వీక్లి పాజిటివిటీ రేటు 0.14%కి తగ్గిందన్నారు. అయితే గత 6 వారాల నుండి ప్రపంచవ్యాప్తంగా 5.9 లక్షల రోజువారీ సగటు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

కోవిడ్ ఇంకా ముగియలేదు:

అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, కోవిడ్-19 నియంత్రణ పట్ల ఆత్మసంతృప్తిని హెచ్చరించి, కఠినంగా ఉండాలని సూచించారు. కోవిడ్ ఇంకా ముగియలేదని ప్రధాని పునరుద్ఘాటించారు మరియు ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాలలో కొనసాగుతున్న నిఘా చర్యలను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. పరికరాలు, ప్రక్రియలు మరియు మానవ వనరుల పరంగా అన్ని స్థాయిలలోని మొత్తం కోవిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఉన్నతస్థాయి సంసిద్ధతతో నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, వెంటిలేటర్లు మరియు మానవ వనరులతో సహా హాస్పిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడానికి కోవిడ్ నిర్దిష్ట సౌకర్యాలను ఆడిట్ చేయాలని రాష్ట్రాలకు సూచించారు.

టెస్టింగ్ మరియు జెనోమిక్ సీక్వెన్సింగ్ ప్రయత్నాలను వేగవంతం చేయాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నియమించబడిన ఇన్సాకాగ్ జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీస్ తో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ శాంపిల్స్ పంచుకోవాలని రాష్ట్రాలను కోరారు. ఇది దేశంలో చలామణిలో ఉన్న కొత్త వేరియంట్‌లను సకాలంలో గుర్తించడానికి మద్దతు ఇస్తుందని, అవసరమైన ప్రజారోగ్య చర్యలను సులభతరం చేస్తుందన్నారు. రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడంతోపాటు రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, అన్ని సమయాల్లో కోవిడ్ నిబంధనలను అనుసరించాలని ప్రతి ఒక్కరినీ ప్రధాని కోరారు. ముఖ్యంగా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికీ మరియు వృద్దులకు ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు ప్రోత్సహించాలని కూడా ప్రధాని సూచించారు.

మందులు, వ్యాక్సిన్‌లు మరియు ఆసుపత్రి బెడ్స్ కు సంబంధించి తగిన లభ్యత ఉందని అధికారులు ప్రధానికి తెలియజేయగా, నిత్యావసర ఔషధాల లభ్యత, ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రధాని సూచించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్ల పనిని ప్రధాని హైలైట్ చేస్తూ, అదే నిస్వార్థంగా మరియు అంకితభావంతో పని చేయడం కొనసాగించాలని వారిని ప్రధాని మోదీ ఉద్బోధించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్ షా, మన్సుఖ్ మాండవియా, జ్యోతిరాదిత్య సింధియా, ఎస్.జైశంకర్, అనురాగ్ ఠాకూర్, భారతి ప్రవీణ్ పవార్ సహా నీతి ఆయోగ్, కేంద్ర ఆరోగ్య శాఖ, పలు సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eleven =