గూగుల్ కీలక నిర్ణయం, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగింపు

Coronavirus, Coronavirus Pandemic, Google, Google Extends Work From Home, Google Extends Work From Home for Employees, Google extends work from home to 2021, Google extends Work From Home until July 2021, Google Work From Home

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రముఖ సంస్థలన్నీ ఉద్యోగులకు “వర్క్ ఫ్రమ్ హోమ్” కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. టెక్నాలజీ దిగ్గజ సంస్థ గూగుల్, సోషల్ మీడియా సంస్థలు పేస్ బుక్, ట్విట్టర్ కూడా అదే బాటలో నడిచాయి. ఈ నేపథ్యంలో గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని(వర్క్ ఫ్రమ్ హోమ్) జూన్‌ 30, 2021 వరకు పొడిగించింది. కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా సంస్థ కీలక సభ్యులతో చర్చించిన అనంతరం గూగుల్‌ ఈసీవో సుందర్‌ పిచాయ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించడంతో దాదాపు 2 లక్షల మంది గూగుల్‌ ఉద్యోగులకు ఉపశమనం లభించినట్లయింది. తాజా గూగుల్ సంస్థ నిర్ణయంతో మరొకొన్ని కీలక సంస్థలు కూడా ఆ దిశగా అడుగులేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here