ఐపీఎల్-2020 షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే?

IPL 2020, IPL 2020 Latest News, IPL 2020 schedule, ipl 2020 schedule new, IPL 2020 Updates, Meeting of Governing Council, national news, Sports, sports news, upcoming IPL 2020

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్ కు రంగం సిద్దమవుతుంది. ఐపీఎల్-2020‌ ను సెప్టెంబరు 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహించనున్నట్టు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షెడ్యూల్, ఇతర విధివిధానాలుపై చర్చించడానికి ఆగస్టు 1న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. అదే రోజున ఐపీఎల్ పూర్తీ షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే 51 రోజుల పాటు జరిగే ఈ లీగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆటగాళ్ల ప్రాక్టీస్, భద్రత, వసతి వ్యవహారాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ హాజరు కానున్నారు.

టీ20 వరల్డ్ కప్ వాయిదా వేస్తునట్టు ఐసీసీ ఇటీవల ప్రకటించడంతో అదే సమయంలో ఐపీఎల్-2020 నిర్వహణకు మార్గం సుగమమైంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో ఐపీఎల్ ప్రారంభించడానికి బీసీసీఐ భారత ప్రభుత్వం అనుమతి కోరింది. యూఏఈలోని అబుదాబి, షార్జా మరియు దుబాయ్‌ వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. ఐపీఎల్ లో పాల్గొనే 8 జట్లు ఆగస్టు 20 కల్లా యూఏఈకి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టే అవకాశముంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here