శ్రీనగర్‌లో గ్రనేడ్‌ దాడి, ఒకరి మృతి 18మందికి గాయాలు

15 Injured In A Grenade Attack, 18 Injured In Grenade Attack In Srinagar, Central Reserve Police Force, grenade attack in jammu and kashmir, grenade attack in Srinagar, Hari Singh High Street, Jammu and Kashmir, Jammu And Kashmir – One Killed, Jammu And Kashmir One Killed 15 Injured In A Grenade Attack, Mango News Telugu, national news headlines today, national news updates 2019, One Killed 18 Injured In Grenade Attack In Srinagar, Srinagar

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడి చేసారు, శ్రీనగర్‌లో గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు. నవంబర్ 4, సోమవారం మధ్యాహ్నం శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్‌ రోడ్‌లోని మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, 15 మంది పౌరులు, ముగ్గురు ఎస్ఎస్బీ సిబ్బంది గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తిని సహారన్‌పూర్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల రింకు సింగ్‌గా గుర్తించారు. గాయపడిన వారిని సమీపంలోని ఎస్‌ఎంహెచ్‌ఎస్ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఇప్పటికే భద్రతాదళాలు అదుపులోకి తీసుకుని, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మురం చేసారు. రెండు వారాల వ్యవధిలో ఉగ్రవాదులు దాడికి పాల్పడడం ఇది రెండోసారి. అక్టోబర్ 28న ఉత్తర కశ్మీర్‌లోని సొపోర్‌ బస్టాండ్ లో ఉగ్రవాదుల జరిపిన గ్రనేడ్‌ దాడిలో 19 మంది గాయపడిన సంగతి తెలిసిందే. పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను భారత్ ద్వంసం చేస్తుండంతోనే, ఉగ్రవాదులు కశ్మీర్లో దాడులకు పాల్పడుతున్నారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here