కొత్త ఐటీ నిబంధనలు పాటించడంపై ట్విట్టర్ కు కేంద్రం ఫైనల్ నోటీసులు జారీ

Centre issues final notice to Twitter India, Comply or face consequences, Government gives final notice to Twitter for compliance with IT rules, Govt gives one last notice to Twitter to comply with IT rules, Govt of India Serves Final Notice to Twitter over Non Compliance of New IT Rules, Govt sends final notice to Twitter for compliance, Govt serves final notice to Twitter, India government serves final notice to Twitter, Mango News, Twitter, Twitter IT Rules

దేశంలో సోషల్ మీడియాకు సంబంధించి వినియోగదారుల పారదర్శకత, జవాబుదారీతనం, హక్కుల గురించి ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021 సెక్షన్ కింద కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల విషయంలో ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ ఐటీ నిబంధనలను పాటించడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ శనివారం నాడు ట్విట్టర్ సంస్థకు తుది నోటీసులు జారీ చేసింది.

కేంద్రం లేఖలపై ట్విట్టర్ నుంచి స్పందనలు స్పష్టత ఇచ్చే విధంగా లేవని లేదా నిబంధనలకు పూర్తిగా అంగీకారాన్ని సూచించే విధంగా లేవని పేర్కొన్నారు. ఈ రోజు వరకు నిబంధనల ప్రకారం అవసరమైన విధంగా చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ వివరాలను ట్విట్టర్ తెలియజేయలేదన్నారు. అలాగే ట్విట్టర్ నామినేట్ చేసిన రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ మరియు నోడల్ కాంటాక్ట్ పర్సన్ నిబంధనలలో సూచించిన విధంగా భారత్ లో పనిచేసే ట్విట్టర్ ఉద్యోగి కాదని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ మే 26, 2021 నుండి అమల్లోకి వచ్చాయని, ఇప్పటికే వారానికి పైగా సమయం గడిచినప్పటికీ ట్విట్టర్ ఈ నిబంధనల పాటించటానికి నిరాకరించిందని అన్నారు. ఈ క్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం, 2000 లోని సెక్షన్ 79 ప్రకారం ఈ నిబంధనల నిరాకరణతో అందుబాటులో ఉన్న మధ్యవర్తిత్వ హోదాను ట్విట్టర్ కోల్పోవడం సహా అనాలోచిత పరిణామాలకు దారితీస్తుందని చెప్పనవసరం లేదని కేంద్రం పేర్కొంది. నిబంధనల నిరాకరణకు కొనసాగిస్తే చట్టప్రకారం చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here