ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 76వ సెషన్ : నేడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం

76th Session of the UN General Assembly, 76th Session of the United Nations General Assembly, 76th Session of UNGA, Mango News, Modi in US- Day 2 highlights, PM Modi with US President Joe Biden, PM Modi’s US visit LIVE Updates, pm narendra modi, PM Narendra Modi to Address the 76th Session of UNGA, PM Narendra Modi to Address the 76th Session of UNGA Today, Prime Minister Narendra Modi, US President Joe Biden

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో సెప్టెంబర్ 24, శుక్రవారం నాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సమావేశమయ్యారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యమిచ్చిన క్వాడ్ లీడర్ సమ్మిట్‌లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాతో కలిసి ప్రధాని మోదీ పాల్గొన్నారు. మార్చి 12, 2021న క్వాడ్‌ నేతల మధ్య మొదటిసారిగా వర్చువల్ సమ్మిట్ జరగగా, శుక్రవారం తొలిసారిగా నాలుగు దేశాధినేతల మధ్య వ్యక్తిగత సమావేశం జరిగింది. క్వాడ్ సమ్మిట్ అనంతరం ప్రధాని మోదీ న్యూయార్క్ చేరుకున్నారు.

సెప్టెంబర్ 25, శనివారం న్యూయార్క్‌ లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 76వ సెషన్ లో ఉన్నత-స్థాయి విభాగం యొక్క జనరల్ డిబేట్ లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ సంవత్సరం జనరల్ డిబేట్ యొక్క థీమ్ ను కోవిడ్-19 నుండి కోలుకోవడం, నిలకడగా పునర్నిర్మించడం, ప్లానెట్ యొక్క అవసరాలకు ప్రతిస్పందించడం, ప్రజల హక్కులను గౌరవించడం మరియు ఐక్యరాజ్య సమితిని పునరుజ్జీవింపజేయడం వంటివిగా నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 76వ సెషన్ లో భాగంగా శనివారం ప్రధాని మోదీ మొదటి స్పీకర్‌ గా ఉన్నారు. అనంతరం భారత్ కు తిరుగు ప్రయాణమై, సెప్టెంబర్ 26న ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ న్యూఢిల్లీకి చేరుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − three =