కేంద్రం కీలక నిర్ణయం, రాజీవ్ గాంధీ ఫౌండేషన్, చారిటబుల్ ట్రస్ట్ లపై విచారణకు కమిటీ ఏర్పాటు

3 Gandhi Family Trusts, Congress, Gandhi Family Trusts, Home Ministry, Home Ministry Sets up Inter-ministerial Committee, Home Ministry to probe into 3 trusts, Inter-ministerial Committee, Inter-ministerial Committee to Coordinate Probe into 3 Gandhi Family Trusts, national news

రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్ లపై వస్తున్న ఆర్థిక అవకతవకల ఆరోపణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రస్ట్ లలో వివిధ చట్టపరమైన నిబంధనల ఉల్లంఘనపై జరిగే దర్యాప్తును సమన్వయం చేసేందుకు ఒక అంతర్‌ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూలై 8, బుధవారం నాడు ప్రకటించింది. ఈ కమిటీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) స్పెషల్‌ డైరెక్టర్‌ నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. ముందుగా గాంధీ కుటుంబానికి చెందిన ట్రస్ట్‌లకు చైనా రాయబార కార్యాలయం నుంచి నిధులు అందుతున్నాయని, అలాగే యూపీఏ హయాంలో పీఎం సహాయనిధికి వచ్చిన నిధుల్ని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ తరలించారని ఇటీవలే బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు.

అలాగే ఈ ట్రస్ట్ లకు వస్తున్న నిధులకు సంబంధించి మనీ లాండరింగ్, ఎఫ్‌‌సీఆర్, ఐటీ చట్టాల చట్టం ఉల్లంఘనలకు పాల్పడినట్టు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విచారణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌ లకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. అలాగే ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను కూడా ఆమే చూస్తున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =