చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు, అక్టోబర్ 2 నుంచి భారత్ జోడో యాత్ర

Congress Chintan Shivir Sonia Gandhi Announces Bharat Jodo Yatra will be held from October 2, Sonia Gandhi Announces Bharat Jodo Yatra will be held from October 2, Congress Chintan Shivir, Bharat Jodo Yatra will be held from October 2, Congress Leader Sonia Gandhi Announces Bharat Jodo Yatra will be held from October 2, Congress party president Sonia Gandhi announced that the party will undertake a Bharat Yatra from October 2, Bharat Yatra from October 2, Congress announced a nation-wide yatra from 2 October, president Sonia Gandhi, Congress party president Sonia Gandhi, Congress Leader Sonia Gandhi, Sonia Gandhi, Congress party president Sonia Gandhi announces Bharat Jodo Yatra from Kanyakumari to Kashmir on Mahatma Gandhi Jayanti, Congress Chintan Shivir News, Congress Chintan Shivir Latest News, Congress Chintan Shivir Latest Updates, Congress Chintan Shivir Live Updates, Mango News, Mango News Telugu,

రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మూడు రోజుల ‘చింతన్ శిబిర్’ సమావేశం ఆదివారం నాడు ముగిసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహించనున్నట్లు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించింది. దేశంలో కోట్లాది మంది ప్రజల రోజువారీ ఆందోళనలను వెలుగులోకి తెచ్చే దిశగా కోసం ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ యాత్ర ద్వారా సామాజిక సామరస్య బంధాలను బలోపేతం చేయడం, దాడికి గురవుతున్న రాజ్యాంగం యొక్క పునాది విలువలను పరిరక్షించడం జరుగుతుందన్నారు.

అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అంతర్గత టాస్క్‌ఫోర్స్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ విభాగం, పార్టీ పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ విభాగం, జాతీయ శిక్షణా సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకే కుటుంబానికి ఒకే టికెట్ విధానానికి ఆమోదం తెలిపారు. అయితే పార్టీలో ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉన్న కుటుంబసభ్యులకు, బంధువులకు టికెట్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించనున్నట్టు తెలిపారు. స్థానిక స్థాయి నుంచి సీడబ్య్లుసీ వరకు 50 శాతం యువతకు చోటు ఇవ్వాలని నిర్ణయించారు. ఈవీఎంలపై వస్తున్న అనుమానాలపై తీర్మానాన్ని ఆమోదిస్తూ, మళ్ళీ బ్యాలెట్స్ ద్వారా ఎన్నికల జరిపే అంశంపై ఇతర పార్టీలతో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రజలతో కాంగ్రెస్ యొక్క అనుబంధం తెగిపోయిందని, ఈ విషయాన్ని అత్యవసరంగా సరిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలదని ప్రజలు అర్థం చేసుకున్నారని, దేశం కోసం పార్టీ సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు లేదా కార్యకర్తలు అయినా ప్రజల వద్దకు వెళ్లి వారితో కూర్చోని మాట్లాడాలి అని రాహుల్ గాంధీ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =