కొత్త రూల్స్‌ను ప్ర‌క‌టించిన ఐసీసీ.. బంతికి లాలాజలం రాయడంపై శాశ్వత నిషేధం, మన్కడింగ్ పేరు మార్పు

ICC Announces New Cricket Rules Like Applying Saliva Bans Permanently on Ball No Mankading and More, ICC Announces New Cricket Rules, Saliva Bans Permanently on Ball, No Mankading and More, ICC New Cricket Rules, Mango News, Mango News Telugu, ICC Cricket Rules, ICC Rules Applying Saliva Bans, ICC Rules No Mankading, International Cricket Council , International Cricket Council New Rules, ICC New Rules On Twitter, New ICC Cricket Rules, Cricket Rule Changes By ICC

అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) కొత్త రూల్స్‌ను ప్ర‌క‌టించింది. క్రీడాకారుల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిలో కొన్ని కీలక మార్పులు సూచిస్తూ బీసీసీఐ అధ్యక్షుడు సౌర‌వ్ గంగూలీ నేతృత్వంలోని బృందం ఇచ్చిన నివేదికను ఐసీసీ ఆమోదించింది. అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి ఏ కొత్త రూల్స్ అమ‌లులోకి రానుండగా, ఆస్ట్రేలియాలో వ‌చ్చే నెల‌ల జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఈ కొత్త రూల్స్ పాటిస్తారు. బంతిని ప్రకాశింపజేయడానికి ఆటగాళ్ళు లాలాజలాన్ని ఉపయోగించడం సర్వసాధారణ విషయం. అయితే ఇప్పుడు దీనిపై సంపూర్ణ నిషేధం విధించారు. దీనితో పాటు ఇప్పటివరకు అమలులో ఉన్న పలు కీలక నిబంధనలలో మార్పులు చేర్పులు చేశారు. ఈ మేరకు ఐసీసీ తన అధికారిక సోషల్ మీడియా వేదిక ట్విటర్‌లో కూడా తెలిపింది.

ఐసీసీ కొత్త నిబంధనలు.. 

  • కోవిడ్ -19 కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమలు చేయబడిన లాలాజల నిషేధం ఇప్పుడు శాశ్వతంగా ఉంటుంది.
  • కొత్త నిబంధనల ప్రకారం మన్కడ్ ఇకపై అన్యాయమైన ఆటగా పరిగణించబడదు, కానీ దానిని ‘రన్-అవుట్’ అని పిలుస్తారు.
  • ఒక‌వేళ బ్యాట‌ర్ క్యాచ్ ఔట్ అయితే, ఇద్దరు బ్యాటర్‌లు ఒకరికొకరు క్రాస్ చేసినప్పటికీ.. కొత్త‌గా వ‌చ్చే బ్యాట‌ర్ స్ట్ర‌యిక‌ర్ ఎండ్‌లోనే ఆడతాడు.
  • ఒక బ్యాట‌ర్ ఔటైన త‌ర్వాత క్రీజ్‌లోకి వ‌చ్చే కొత్త బ్యాట‌ర్ రెండు నిమిషాల వ్య‌వ‌ధిలో క్రీజులోకి అడుగుపెట్టి బంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ‌తంలో ఇది మూడు నిమిషాలుగా ఉంది.
  • వ‌న్డేలు, టెస్టుల్లో ఇది రెండు నిమిషాలుగా మార్చగా, టీ20ల్లో 90 సెక‌న్ల వ్య‌వ‌ధిను మాత్రం చేంజ్ చేయలేదు.
  • ఇక ఈ స‌మ‌యంలో బ్యాట‌ర్ క్రీజులోకి చేరుకోకుంటే, ఫీల్డింగ్ కెప్టెన్ టైమ్ అవుట్ కోసం అప్పీల్ చేయవచ్చు.
  • అలాగే బౌలర్ రన్నప్ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్‌లో ఏదైనా ఉద్దేశపూర్వక కదలికలు చోటుచేసుకుంటే దానిని డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు.
  • అంతేకాకుండా బ్యాటింగ్ జట్టుకు పెనాల్టీ రూపంలో 5 పరుగులను అంపైర్ ప్రకటించే అవకాశం కూడా ఉంది.
  • ఇక బ్యాటర్ బంతిని ఆడేటప్పుడు పిచ్ పైనే ఉండాలి, ఒకవేళ పిచ్ బయటకు వచ్చి ఆడితే దానిని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు. అలాగే ఇది బౌలర్ కారణంగా జరిగితే అప్పుడు నో బాల్‌గా పరిగణిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 7 =