నల్గొండ జిల్లా నేతలతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ భేటీ.. మునుగోడు ఉప ఎన్నికపై కీలక చర్చ

CM KCR Meets Nalgonda District TRS Leaders To Discuss on Munugode Bypoll in Pragathi Bhavan, CM KCR Meets Nalgonda TRS Leaders, CM KCR Review on Munugode Bypoll, CM KCR Meet on Elections At Pragathi Bhavan, CM KCR Reviews On Bypoll Elections, Mango News, Mango News Telugu, Munugode By-Election Latest News And Updates, Munugode By-Election, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, TRS Party, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP

తెలంగాణలో త్వరలో ఉపఎన్నిక జరుగనున్న మునుగోడులో ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకు వేసి అభ్యర్థిని కూడా ప్రకటించింది. మరోవైపు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా దృష్టి సారించారు. దీనికి సంబంధించి చర్చించేందుకు నల్గొండ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలతో ఆయన మంగళవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజన కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌ అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందన్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీ కేడర్‌కు సంకేతాలు పంపించారు. మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. త్వరలోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పేరును కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్‌ ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను అభ్యర్ధిగా నిలబెట్టడంతో కేసీఆర్ కూడా ఆ సామజిక వర్గం వైపే చూస్తారా? లేదంటే బీసీ సామజిక వర్గాన్ని ఎంచుకుంటారా? అనేది త్వరలోనే తేలనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − two =