ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌: 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, పైకి దూసుకొచ్చిన కోహ్లీ

ICC T20 Rankings Update Virat Kohli Wanindu Hasaranga Improved their Spots after Asia Cup 2022, ICC T20I Rankings, Virat Kohli Makes Big Move In T20I Rankings, Virat Kohli Jumps to 15th Spot, ICC T20I Player Rankings, Mango News, Mango News Telugu, Virat Kohli Climbs 14 Spots, Virat Kohli Latest News And Updates, Wanindu Hasaranga , ICC T20 Rankings Update , Virat Kohli , Wanindu Hasaranga, Improved Their Spots After Asia Cup 2022, Asia Cup 2022

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో టెస్టు ర్యాంకింగ్స్, వన్డే ర్యాంకింగ్స్, టీ20 ర్యాంకింగ్స్ ను అప్డేట్ చేసింది. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ 4 స్థానంలో నిలిచాడు. దాదాపు మూడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో తన అంతర్జాతీయ సెంచరీని టీ20ల్లో సాధించిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌లో కోహ్లీ మొత్తం 276 పరుగులు చేశాడు. దీంతో టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో మొత్తం 14 స్థానాలు మెరుగుపడి కోహ్లీ 15వ స్థానానికి చేరుకున్నాడు. భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ మొదటి, దక్షిణాఫ్రికా ఆటగాడు అయిడెన్ మార్కరం రెండు, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ మూడో స్థానాల్లో ఉన్నారు.

అలాగే టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజెల్ ఉడ్, దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రైజ్ షమ్సీ, ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్, ఆఫ్ఘానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ వరుసగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక శ్రీలంక ఆసియా కప్-2022 గెలవడంలో కీలక పాత్ర పోషించిన వణిందు హసరంగ మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఆసియా కప్ లో హసరంగ మొత్తం తొమ్మిది వికెట్లు తీశాడు. మరోవైపు భారత్ నుంచి భువనేశ్వర్ కుమార్ 7వ స్థానంలో, యజ్వేంద్ర చాహల్ 27వ స్థానంలో నిలిచారు. ఆల్‌రౌండర్‌ విభాగంలో టాప్-10 లో భారత్ నుంచి హార్దిక్ పాండ్యా 7వ స్థానంలో నిలిచాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 11 =