నాపై దాడి జరిగితే, యావత్ తెలంగాణపై దాడి జరిగినట్లుగానే భావిస్తాం – బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

BJP MLA Etela Rajender Sensational Remarks on CM KCR and TRS Govt, BJP MLA Etela Rajender Comments on CM KCR, BJP MLA Etela Rajender, Etela Rajender Serious Comments on CM KCR, Etela Rajender Sensational Comments , Telangna CM KCR, Mango News, Mango News Telugu, BJP MLA Etela Rajender , Etela Rajender Latest News And Updates, CM KCR News And Live Updates, Telangna BJP, Telangna BJP News And Updates, Telangna News

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. చావుకి భయపడేది లేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నిసార్లు బెదిరింపులు వచ్చినా భయపడలేదని తెలిపారు. తనపై ఎన్నోసార్లు రెక్కీ నిర్వహించారని, అయినా వెనుకడుగేసేది లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ స్పీకర్‌ను మరమనిషి అంటే సీఎం కేసీఆర్‌కు ఇంత కోపం ఎందుకని? ప్రతిపక్ష సభ్యులను సభలో మాట్లాడనీయకుండా సస్పెండ్ చేస్తున్నారని ఈటల మండిపడ్డారు.

కాంగ్రెస్‌, మజ్లీస్‌ పార్టీలు సీఎం కేసీఆర్‌కు వంత పాడుతున్నాయని, ప్రజాసమస్యలపై నిలదీస్తోంది బీజేపీ ఒక్కటేనని, అందుకే కేసీఆర్ ప్రత్యేకించి బీజేపీ సభ్యులను సభలో మాట్లాడనీయకుండా చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. గత సంప్రదాయాలకు భిన్నంగా గవర్నర్‌ ప్రసంగం లేకుండా సభను ప్రారంభించారని, అసలు బీఏసీ గురించి బీజేపీకి సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్నవారు అన్ని పార్టీలను, సభ్యులను ఒకేలా చూడాలని, వారి హక్కులను కాపాడాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో నిబద్దతతో పనిచేశానని, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడతానని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడించే వరకు నిద్రపోయేది లేదని, తనపై, తన కుటుంబ సభ్యులపై దాడి జరిగితే యావత్‌ తెలంగాణపై జరిగిన దాడిగా భావిస్తామని తేల్చి చెప్పారు ఈటల రాజేందర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seven =