టీమిండియా బౌలర్ భువనేశ్వర్ ‌కుమార్ కు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు ‌

Bhuvneshwar Kumar, Bhuvneshwar Kumar bags ICC Men’s Player of the Month, Bhuvneshwar Kumar bags ICC Player of the Month Award, Bhuvneshwar Kumar ICC award, Bhuvneshwar Kumar Pips Rashid Khan And Sean Williams, Bhuvneshwar Kumar wins ICC Player of the Month award, Bhuvneshwar named ICC Men’s Player of the Month, India Bowler Bhuvneshwar Kumar, India Bowler Bhuvneshwar Kumar bags ICC Player of the Month Award for March, Lizelle Lee bag ICC Player of the Month, Mango News

మార్చి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును భారత్ బౌలర్ భువనేశ్వర్ ‌కుమార్‌ గెలుచుకున్నాడు. జనవరి 2021 నుంచి అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి మెన్ మరియు ఉమెన్ క్రికెటర్ల విభాగాల్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డును వరుసగా మూడో నెల కూడా భారత ఆటగాడే దక్కించుకోవడం విశేషం.

జనవరి నెలకు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్, ఫిబ్రవరి నెలకు బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ అవార్డు దక్కించుకున్నారు. ఇక ఇంగ్లాండ్ తో మార్చి నెలలో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ లో 6, టీ20ల్లో 4 వికెట్లు తీసి భువనేశ్వర్ ‌కుమార్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ అవార్డ్‌ రేసులో ఆఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్, ‌జింబాబ్వే బ్యాటింగ్ ఆల్ రౌండర్ సీన్ విలియమ్స్‌ ఉన్నప్పటికీ ఓటింగ్‌లో భువనేశ్వర్ ‌కుమార్‌ ‌ముందంజలో ఉండి ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.

మరోవైపు మార్చి నెలకు ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సౌత్ ఆఫ్రికా క్రికెట్ క్రీడాకారిణి లిజెల్లె లీ గెలుచుకున్నారు. ఓటింగ్ లో రాజేశ్వరి గయక్వాడ్ (ఇండియా), పూనమ్ రౌత్ (ఇండియా‌) కంటే ముందంజలో నిలిచి ఆమె ఈ అవార్డు దక్కించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here