కరోనాపై మరికొద్ది రోజులు ఇదే యుద్ధవాతావరణంలో పనిచేయాలి, మంత్రి ఈటల పిలుపు

Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, District Health Officials over Covid Situation, Etala Rajender held Teleconference with District Health Officials over Covid Situation, Health Minister Etala Rajender, Mango News, Minister Etala Rajender, Minister Etala Rajender held Teleconference, Minister Etala Rajender held Teleconference with District Health Officials over Covid Situation, telangana coronavirus cases today, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list, Telangana Minister Etala Rajender

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయటానికి , ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి, వైరస్ సోకిన వారు మరణించకుండా ఉండేందుకు పూర్తి అప్రమత్తతో పని చేయాలని మరోమారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. బుధవారం నాడు జిల్లా వైద్య అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానంగా గ్రామస్థాయిలో ఉన్న ఆశ వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో ఉన్న డాక్టర్లు కరోనా వైరస్ రోగులను వెంటనే గుర్తించడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టాలని చెప్పారు.

టెస్టింగ్-ట్రీటింగ్-ట్రాకింగ్, వాక్సినేషన్ లతో పాటు, ఇతర వైద్య సేవలు కూడా అందిస్తూ నిరంతర బిజీగా వైద్య సేవలు అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయి డాక్టర్లకు సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. మరికొద్ది రోజులు ఇదే యుద్ధ వాతావరణంలో పని చేయాలని పిలుపునిచ్చారు. ఆశా వర్కర్లకు, ప్రాథమిక ఆరోగ్య స్థాయి డాక్టర్లకు, సిబ్బందికి అవసరమైన పర్సనల్ కేర్ ఎక్విప్మెంట్ లు అన్ని సకాలంలో అందేలా చూడాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ ను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాల్లో టెస్ట్ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ట్రీట్మెంట్ అందిస్తున్న హాస్పిటల్స్ లో ఆక్సిజన్, రేమేదేస్విర్ ఇంజెక్షన్ల కొరత లేకుండా చూడాలని కోరారు. సాధ్యమైనంతవరకు ఎక్కువ మంది పేషెంట్లను హోమ్ ఐసొలేషన్ లో ఉంచే విధంగా కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. సీరియస్ అయిన పేషెంట్లకు ఆసుపత్రికి తరలించేందుకు అవసరమైన అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. చనిపోయిన వారిని వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. స్థానిక మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలతో సమన్వయం చేసుకొని మృతదేహాలను అందించాలని సూచించారు.

ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈసారి వైరస్ వేగంగా వ్యాప్తి చెందటం వల్ల గుంపులుగా చేరవద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కువమంది ఒకే ప్రాంతాల్లో గుమికూడినప్పుడు ఏ ఒక్కరికి కరోనా వైరస్ వచ్చిన అందరికీ పరీక్షలు చేసే విధంగా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి అధికారులు అందరినీ అప్రమత్తం చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 9 =