తాడికొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్

AP Coronavirus Cases, ap coronavirus cases today, AP Coronavirus News, AP Coronavirus Updates, COVID-19, Mango News, MLA Undavalli Sridevi Tests Positive, Tadikonda YSRCP MLA Undavalli Sridevi, Tadikonda YSRCP MLA Undavalli Sridevi Tests Positive, Tadikonda YSRCP MLA Undavalli Sridevi Tests Positive for Covid-19, YSRCP MLA Undavalli Sridevi, YSRCP MLA Undavalli Sridevi Tests Positive, YSRCP MLA Undavalli Sridevi Tests Positive for Covid-19

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే శ్రీదేవి ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతునట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే ఆరోగ్యంపై ఏపీ సీఎంవో ఆరా తీసినట్టు సమాచారం. ఇక ఏపీలో ఏప్రిల్ 14 నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,37,049 కు చేరుకుంది. వీరిలో 9,01,327 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 28383 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here