ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రా: కీలక ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారి, అశ్విన్

3rd Test, IND vs AUS 3rd Test highlights, India vs Australia 3rd Test, India Vs Australia 3rd Test 2021, India vs Australia 3rd Test Day 5 Highlights, India vs Australia 3rd Test Match, India vs Australia 3rd Test Match News, India vs Australia 3rd Test playing XI, India vs Australia Highlights, India vs Australia Live Score, Mango News Telugu

సిడ్నీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ఇప్పటికి‌ 1-1 గా ఉంది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ లక్ష్యం 407 పరుగుల ఉండగా, 98/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు‌ ఐదు వికెట్లు కోల్పోయి 334 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఆటగాళ్లలో చటేశ్వర్ పుజారా(77), రిషబ్ పంత్‌(97) రాణించారు. ఓదశలో రిషబ్ పంత్ విజృంభణతో భారత్ జట్టు విజయంవైపు దూసుకెళ్తున్నట్టు కనిపించింది. అయితే సెంచరీ దగ్గరలో పంత్ అవుట్ అవ్వడం, ఆ వెంటనే పుజారా కూడా వెనుదిరగడంతో విజయావకాశాలు సన్నగిల్లాయి.

కాగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హనుమవిహారి, రవిచంద్ర అశ్విన్ లు ఆస్ట్రేలియా‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ, కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ 258 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యంతో జట్టును పరాజయం నుంచి కాపాడి డ్రా వైపు నడిపించారు. ఇక మూడో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 131, రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులతో ఆకట్టుకున్న స్టీవ్ స్మిత్ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు బిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో జనవరి 15 నుంచి జరగనుంది.

భారత్–ఆస్ట్రేలియా మూడో టెస్టు వివరాలు:

ఆస్ట్రేలియా తోలి ఇన్నింగ్స్: 338-10

  • స్టీవ్ స్మిత్‌ (131), లబుషేన్‌ (91), విల్‌ పకోస్కీ(61)
  • రవీంద్ర జడేజా 4/62, బుమ్రా 2/66, సైనీ 2/65

భారత్ తోలి ఇన్నింగ్స్: 244-10

  • శుభ్‌మన్‌ గిల్‌(50), పుజారా(50)
  • కమ్మిన్స్ 4/29, హేజెల్ హుడ్ 2/21

ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్: 312-6 d

  • గ్రీన్‌(84), స్టీవ్ స్మిత్‌ (81), లబుషేన్‌ (73)
  • సైనీ 2/54, అశ్విన్ 2/95

భారత్ రెండవ ఇన్నింగ్స్: 334-5

  • రిషబ్ పంత్‌(97), చటేశ్వర్ పుజారా(77), రోహిత్ శర్మ (52), శుభ్‌మన్‌ గిల్‌(31)
  • లియాన్ 2/114, హేజెల్ హుడ్ 2/39
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + seventeen =