భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్టు: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ

India vs England 2nd Test: Rohit Sharma Hits His Seventh Test Century,Mango News,Mango News Telugu,India vs England 2nd Test: Rohit Sharma Hits His Seventh Test Century,IND vs ENG 2nd Test Day 1 Highlights: Rohit 161 Rahane fifty power India to 300/6 against England,IND Vs ENG, 2nd Test: Rohit Sharma Becomes First Batsman To Score Centuries In All Formats Against Four Teams,India vs England 2nd Test: Rohit Sharma's century steers India to 189/3 at tea on Day 1

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు శనివారం ఉదయం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన భారత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా తోలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ రోహిత్ శర్మ ధాటిగా ఆడుతూ సెంచరీ సాధించాడు. 41.3 ఓవర్లవద్ద 130 బంతుల్లో 14 పోర్లు, 2 సిక్స్ ల సాయంతో టెస్టుల్లో తన ఏడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో గత కొన్ని ఇన్నింగ్స్ లలో విఫలమవుతూ విమర్శలు ఎదురుకుంటున్న హిట్ మ్యాన్ తాజా సెంచరీతో మరోసారి తన సత్తా చాటాడు. రోహిత్‌ శర్మ(129)తో పాటుగా అజింక్య ర‌హానే(35) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతానికి 51 ఓవర్లలకు భారత్ 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది.

తోలి ఇన్నింగ్ ప్రారంభంలో శుబ్ మన్ గిల్ డకౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం చటేశ్వర పుజారాతో కలిసి రోహిత్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కున్నాడు. 85 పరుగుల జట్టు స్కోర్ వద్ద పుజారా(21) జాక్ లీచ్ బౌలింగ్ లో స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వెంటనే మొయిన్ బౌలింగ్ లో డకౌట్ అవ్వడంతో భారత్ జట్టు ఇబ్బందుల్లో పడింది. క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానేతో కలిసి రోహిత్ శర్మ తనదైన షాట్లతో అలరిస్తూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here