ఏపీలో ముగిసిన రెండోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌటింగ్ ప్రారంభం

AP Second Phase Panchayat Elections Polling Completed Peacefully Counting Started,Mango News,Mango News Telugu,AP panchayat polls: Voting for 2786 panchayats in second phase concludes peacefully; turnout at 81.61%,Andhra Pradesh Panchayat Elections: 82% Voter Turnout in Second Phase Polling Ends Peacefully,AP panchayat election results 2021 live updates: 81.61% voter turnout; counting of votes being done

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగింది. అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా మొత్తం 13 జిల్లాల్లో 18 డివిజన్లకు చెందిన 167 మండలాల్లోని 2786 పంచాయతీలకు, 20,817 వార్డులకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. కాగా మధ్యాహ్నం 2:30 గంటల వరకు 76.11% పోలింగ్ ‌నమోదయింది.

ఉదయం నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఓట్లు వేశారు. పూర్తి పోలింగ్ శాతం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియను కూడా ప్రారంభించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలపై ప్రకటన వచ్చిన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక కూడా చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 13 =