సెప్టెంబరు 15 నుంచి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం

Academic Calendar for Engineering Colleges, AICTE, AICTE Academic Calendar for Engineering Colleges, AICTE releases New Academic Calendar, AICTE Revised Academic Calendar, AICTE Revised Academic Calendar Details, engineering colleges to start from September 15, Revised Academic Calendar

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 2020-21 విద్యా సంవత్సరానికి గానూ సవరించిన క్యాలెండరు ను ప్రకటించింది. ముందుగా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి తరగతులను ప్రారంభించాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. కాగా ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబరు 15వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించేలా షెడ్యూల్ ను విడుదల చేసింది.

ఏఐసీటీఈ సవరించిన అకడమిక్ క్యాలెండరు:

  • కాలేజీలకు అనుమతి ఇవ్వడానికి ఆఖరు తేదీ – జూన్ 30, 2020
  • కాలేజీలకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వడం – జూలై 15, 2020
  • ప్రవేశాల కోసం మొదటి రౌండ్ కౌన్సెలింగ్/సీట్ల కేటాయింపు – ఆగస్టు 30, 2020
  • ప్రవేశాల కోసం రెండో రౌండ్ కౌన్సెలింగ్/సీట్ల కేటాయింపు – సెప్టెంబర్ 10, 2020
  • ఖాళీల అనుగుణంగా విద్యార్థులు చేరడానికి చివరి తేదీ – సెప్టెంబర్ 15, 2020
  • పీజీడిఎం/పీజీసిఎం మినహా ఇతర సాంకేతిక కోర్సుల విద్యార్థులకు తరగతులు ప్రారంభం – ఆగస్టు 16, 2020
  • కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు మరియు సెకండ్ ఇయర్ లో చేరే లాటరల్ ఎంట్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యే తేదీ – సెప్టెంబర్ 15, 2020
  • ఇప్పటికే ఉన్న పీజీడిఎం/పీజీసిఎం విద్యార్థులకు తరగతులు ప్రారంభం – జూలై 15, 2020
  • కొత్తగా ప్రవేశం పొందిన పీజీడిఎం/పీజీసిఎం విద్యార్థుల అకాడమిక్ సెషన్ – ఆగస్టు 1, 2020 నుంచి జూలై 31, 2021
  • ఓపెన్ మరియు డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులలో విద్యార్థుల ప్రవేశాలకు చివరి తేదీ – ఆగస్టు 16, 2020 మరియు ఫిబ్రవరి 15, 2021

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 7 =