మరో ఇద్దరు భారత్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్

India in Sri Lanka, India vs Sri Lanka, Indian Cricketers, Indian Cricketers Yuzvendra Chahal and K Gowtham, Indian Cricketers Yuzvendra Chahal and K Gowtham Tested Positive for Covid-19, Indian Cricketers Yuzvendra Chahal and K Gowtham Tested Positive for Covid-19 in Sri Lanka, Mango News, SL vs Ind T20I, SL vs Ind T20I series, Sri Lanka, Sri Lanka vs India 2021, Yuzvendra Chahal and K Gowtham, Yuzvendra Chahal and K Gowtham test positive, Yuzvendra Chahal and K Gowtham Tested Positive

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత్ క్రికెట్ జట్టులో ఇటీవలే యువ క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లకు కూడా కరోనా సోకింది. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్‌ లకు కరోనా పాజిటివ్‌ గా తేలడంతో, ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిపారు. ముందుగా కృనాల్‌ పాండ్యాకు కరోనా సోకిన అనంతరం అతనితో సన్నిహితంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్‌ లను ఐసోలేషన్ కు తరలించారు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో చాహల్, గౌతమ్‌ లకు కరోనా సోకడంతో, కృనాల్‌ పాండ్యాతో పాటుగా క్వారంటైన్ ముగిసేవరకు వారు శ్రీలంకలోనే ఉండే అవకాశమునట్టు సమాచారం.

మరోవైపు శ్రీలంకతో వన్డే, టీ20ల సిరీస్లు ముగియడంతో మిగతా జట్టు సభ్యులు భారత్ కు తిరిగిరానున్నారు. ముందుగా భారత జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ టూర్‌లో ఉన్న నేపథ్యంలో ఈ వన్డే, టీ20 సిరీస్ ల కోసం కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో యువకులతో కూడిన భారత్ జట్టు శ్రీలంక వెళ్ళింది. ఈ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్ గా, భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్ గా వ్యహరించారు. శ్రీలంకపై 3 వన్డేల సిరీస్ ను భారత్ జట్టు 2-1 తో గెలుచుకుంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాదాపు 8 మంది కీలక ఆటగాళ్లు రెండు టీ20లకు దూరమవడంతో 3 టీ20ల సిరీస్లో భారత్ పరాజయం మూటగట్టుకుంది. మెరుగ్గా ఆడిన శ్రీలంక జట్టు 2-1 తో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eight =