ఆఫ్ఘానిస్తాన్ లో పరిణామాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం

Afghanistan, Afghanistan Crisis, All-Party Meet On Afghanistan In Parliament, Centre All-Party Meeting, Centre All-Party Meeting On Situation in Afghanistan, Centre held All-Party Meeting Today On Situation in Afghanistan, Centre to apprise Opposition on Afghanistan situation, GOI has evacuated a total of 565 people from Afghanistan, Jaishankar says Afghan situation critical, Mango News, Shiromani Akali Dal welcomes Centre’s decision

తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. జై శంకర్‌తో పాటుగా కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి కూడా హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీఎస్ అధినేత హెచ్‌డి దేవెగౌడ, డీఎంకే నుంచి టిఆర్ బాలు, వైఎస్సార్సీపీ నుంచి మిథున్‌రెడ్డి, టీడీపీ నుంచి గల్లా జయదేవ్‌, టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు సహా పలు పార్టీల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆఫ్ఘానిస్తాన్ నుంచి భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, తాలిబన్లు స్వాధీనం చేసుకున్నాక ఆఫ్ఘానిస్తాన్ లో తాజా పరిస్థితుల గురించి కేంద్రమంత్రి ఎస్. జైశంకర్ నాయకులకు వివరించినట్టు తెలుస్తుంది. అఖిలపక్ష సమావేశం అనంతరం జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ, ఆఫ్ఘానిస్తాన్ నుండి వీలైనంత త్వరగా భారతీయులను దేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, అందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =