తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు

Heavy Rains, Heavy Rains In Telangana, Heavy Rains In Telangana And Andhra Pradesh, Heavy Rains Lashes In Both Telugu States, IMD Forecasts Heavy Rains In Andhra Pradesh, IMD Forecasts Heavy Rains In Telangana, IMD Forecasts Heavy Rains In Telangana And Andhra Pradesh, Mango News Telugu, Rains In Telangana And Andhra Pradesh

తెలుగు రాష్టాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతం ఈశాన్యప్రాంతంలో అల్ఫ పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు, దీని ప్రభావం వలన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయాని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుందని, ఈ నెల 5 నుంచి 8 వరకు భారీ వర్షాలు పడతాయని, 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వేస్తాయని అధికారులు హెచ్చరిక జారీ చేసారు.

తెలంగాణ లోని కొన్ని జిల్లాలో గురువారం నుండి వర్షం కొనసాగుతూనే ఉంది, భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది, శుక్రవారం రాత్రి 41 అడుగులకు చేరుకుంది. భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలతో కృష్ణ, గోదావరి నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది, శ్రీశైలం లోకి పెద్దఎత్తున నీరు చేరుతుంది. హైదరాబాద్ నగరంలో కూడ విశ్రాంతి లేకుండా వాన పడుతుండడంతో రోడ్లమీద ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అవుతుంది, సమస్యలు ఉన్న ప్రాంతాల్లో తగిన చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ రెస్క్యూ టీములు సిద్ధంగా ఉన్నాయి. గడిచిన జూన్, జూలై నెలల్లో తక్కువ వర్షపాతం పడడంతో, ఆగస్ట్ లో విస్తారంగా వర్షాలు కురిసి ప్రధానమైన వరి పంటకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని రైతులు భావిస్తున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=XA-9po25GzU]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =