అవకాశం వస్తే కెప్టెన్సీకి నేను రెడీ – పేసర్ బుమ్రా

Jasprit Bumrah on Captaining Team India in Test cricket,Jasprit Bumrah on Captaining Team India,Jasprit Bumrah shares his take on captaining Team India in Test cricket,Jasprit Bumrah on Test captaincy,Jasprit Bumrah reveals how Virat Kohli broke the news,Jasprit Bumrah says he is ready to captain India,Jasprit Bumrah also ready to become India captain,New India Test Captain,New India Test Captain Jasprit Bumrah ,Jasprit Bumrah ,sport news,mango news

టెస్టుల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉండేందుకు అవకాశం వస్తే దానికి తాను సిద్ధమేనని పేసర్‌ బుమ్రా తెలిపాడు. మూడో టెస్టు ముగిశాక టీమ్‌ సమావేశంలో విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని తెలిపాడని బుమ్రా తెలిపాడు. నాయకుడిగా కోహ్లీ జట్టుకు అందించిన విజయాలపై తామంతా అతడిని అభినందించామని చెప్పాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ అనూహ్యంగా వైదొలగడంతో తదుపరి సారథి విషయంలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. రోహిత్‌, రాహుల్‌, రిషభ్ పంత్‌ పేర్లు ముందువరుసలో ఉంటున్నాయి.

తాజాగా, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా కెప్టెన్‌గా ఉండేందుకు ఆసక్తి ప్రదర్శించాడు. ఇప్పటివరకు, టీమిండియాకు కపిల్‌ దేవ్‌ మినహా మరో పేసర్‌ భారత జట్టుకు నాయకత్వం వహించలేదు. ‘ఒకవేళ నన్ను కెప్టెన్‌గా నియమిస్తే అది నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. వాస్తవానికి ఈ అవకాశాన్ని ఏ ఆటగాడైనా వదులుకుంటాడని అనుకోను. ఎవరి కెప్టెన్సీలో పనిచేసినా నా శాయశక్తులా జట్టు కోసం కృషి చేస్తా’ అని బుమ్రా స్పష్టం చేశాడు. ప్రస్తుతం, బుమ్రా వన్డే జట్టు వైస్‌కెప్టెన్‌గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 3 =