జావెలిన్ త్రోలో కొత్త రికార్డు నెలకొల్పిన నీరజ్ చోప్రా

Indian Star Javelin Thrower Neeraj Chopra Set a New National Record at Paavo Nurmi Games, Javelin Thrower Neeraj Chopra Set a New National Record at Paavo Nurmi Games, Indian Star Javelin Thrower Set a New National Record at Paavo Nurmi Games, Neeraj Chopra Set a New National Record at Paavo Nurmi Games, New National Record at Paavo Nurmi Games, Paavo Nurmi Games, New National Record, Indian Star Javelin Thrower Neeraj Chopra, Javelin Thrower Neeraj Chopra, Neeraj Chopra, Paavo Nurmi Games News, Paavo Nurmi Games Latest Nerws, Paavo Nurmi Games Latest Updates, Paavo Nurmi Games Live Updates, Mango News, Mango News Telugu,

జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా మరోసారి సంచలనం సృష్టించాడు. జూన్ 14న ఫిన్‌లాండ్‌ లోని తుర్కులో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో 89.30 మీటర్లు విసిరి తన జాతీయ రికార్డును తానే బద్దలు కొట్టి రజత పతకం సాధించాడు. గత ఏడాది మార్చిలో పాటియాలాలో 88.07 మీటర్లు విసిరి నీరజ్ చోప్రా జాతీయ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా పావో నుర్మీ గేమ్స్‌లో 89.30 మీటర్లు విసరడంతో తన పేరిట కొత్త జాతీయ రికార్డ్ నమోదైంది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌-2020 జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా 87.58 మీటర్ల విసిరి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే.

కాగా జావెలిన్ త్రోలో తన జాతీయ రికార్డును తానే బద్దలు కొట్టిన నీరజ్‌ చోప్రాపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసలు కురిపించారు. గోల్డెన్ గ్రేట్ నీరజ్ చోప్రా మరోసారి సాధించాడు, ఖచ్చితంగా మీరు అతని త్రోను చూసి థ్రిల్డ్ అవుతారు అని అన్నారు. అలాగే ఈ ఘనతపై నీరజ్ చోప్రా స్పందిస్తూ, ఈ సీజన్‌లో ఇది నా మొదటి ఈవెంట్, ఈ సీజన్‌ను గొప్పగా ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రదర్శన నా ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచిందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here