దేశంలో రెండు కొత్త కరోనా వేరియంట్స్, కేసులు పెరుగుదలకు కారణం కాదు

But Govt Says No Relation with Recent Surge in Cases, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, New Corona Variants, New Corona Variants Detected, New Corona Variants Detected In India, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Two New Corona Variants Detected, Two New Corona Variants Detected In India

దేశంలో గతకొన్ని రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్ళీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. అలాగే పలు రకాల కరోనా వ్యాప్తి చెందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. “N440K మరియు E484Q వంటి రెండు కొత్త కరోనా వేరియంట్లు మహారాష్ట్ర, కేరళ మరియు తెలంగాణలో ఇప్పటికే కనుగొనబడ్డాయి. అయితే ఈ రెండు కొత్త వైరస్ వేరియంట్లు వలనే గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరగడానికి కారణమని ఖచ్చితంగా చెప్పలేము” అని నీతి ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్‌ వెల్లడించారు. అలాగే యూకే కరోనా కేసులు 187, దక్షిణాఫ్రికా రకం 6 కేసులు మరియు బ్రెజిల్ రకం ఒక కేసు దేశంలో ఇప్పటికే ఉన్నాయని చెప్పారు.

మరోవైపు ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ, మహారాష్ట్రలో ఇటీవల కరోనా కేసుల పెరుగుదల, అలాగే ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి N440K మరియ E484Q వంటి కొత్త కరోనా వేరియంట్లతో ప్రత్యక్ష సంబంధం లేదని చెప్పారు. ఈ రెండు కరోనా వైరస్ రకాలు ఇతర దేశాలలో కూడా కనుగొనబడ్డాయని, ఇవి భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైనవి కాదని అన్నారు. E484Q కరోనా రకం మహారాష్ట్రలో మార్చి-జూలై 2020 నాటికి నాలుగు సందర్భాల్లో కనుగొనబడిందన్నారు. అలాగే N440K కరోనా రకం మే మరియు సెప్టెంబర్ 2020 మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు అస్సాంలో 13 వేర్వేరు సందర్భాలలో నివేదించబడిందని పేర్కొన్నారు. అయితే ఈ కరోనా రకాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, మరింత శాస్త్రీయ ఆధారాలు వెలువడినప్పుడు పూర్తి సమాచారాన్ని అందిస్తామని డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + sixteen =