బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నిక

BJP Latest News, BJP National President, Jagat Prakash Nadda, JP Nadda As New BJP President, JP Nadda BJP National President, latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2020, national political news 2020
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా జనవరి 20, సోమవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ముందుగా పార్టీ ముఖ్య నాయకులు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి చేరుకొని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పేరును ప్రతిపాదించారు. దీంతో నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జేపీ నడ్డాకు బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జ్‌ రాధామోహన్‌సింగ్‌ నియామకపత్రాన్ని అందించారు. అనంతరం అమిత్‌షా సహా పార్టీ ముఖ్యనాయకులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జేపీ నడ్డా కొంతకాలంగా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా పనిచేసి బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ రోజు సాయంత్రం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రలతో నూతన అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =