కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణయం.. జూలై 17న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు

entral Govt Calls For All-Party Meeting on 17 July Ahead of Parliament's Monsoon Session, All-Party Meeting on 17 July Ahead of Parliament's Monsoon Session, Parliament's Monsoon Session, Monsoon Session Of Parliament, Central Govt Calls For All-Party Meeting on 17 July, Central Government has called for an all-party meeting, Parliamentary Affairs Minister Pralhad Joshi, Affairs Minister Pralhad Joshi, Pralhad Joshi, All-Party Meeting, Central Govt Calls For All-Party Meeting, Central Government, All-Party Meeting on 17 July, Central Govt All-Party Meeting News, Central Govt All-Party Meeting Latest News, Central Govt All-Party Meeting Latest Updates, Central Govt All-Party Meeting Live Updates, Mango News, Mango News Telugu,

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 17న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు అన్ని పార్టీలకు తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆ తర్వాతి రోజు సోమవారం (జూలై 18) ప్రారంభమవనున్నాయి. అదేరోజు సెషన్‌లో రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జూలై 25న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే ఈ సమావేశాలు ఆగస్టు 18 వరకు కొనసాగనున్నాయి. అయితే వర్షాకాల సమావేశాలు సాధారణంగా జూలై మూడవ వారంలో ప్రారంభమవుతాయి మరియు ఆగష్టు 15న జరుపుకునే స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ముగుస్తాయి.

కాగా భారతదేశం-చైనా సరిహద్దు ప్రతిష్టంభన, సాయుధ దళాలకు స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్ కోసం అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం మరియు రూపాయి విలువ పడిపోవడం వంటి కొన్ని కీలక అంశాలపై ఈ పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్షాలు బలంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమావేశాలు సజావుగా కొనసాగేందుకు సహకరించవలసినదిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేయనుంది. ఈ సమావేశాలలోనే ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఎన్నిక జరుగనుంది. ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహించి, ఆగస్టు 11న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 18 =