10 వేల లీటర్ల ఫ్యూయల్‌ నేలపాలు చేసిన దుండగులు

Karnataka Opponents Spilled 10000 Litres of Fuel on The Road From Newly Started Petrol Bunk at Mandya,Karnataka Opponents Spilled 10000 Litres,Spilled 10000 Litres of Fuel on The Road,Newly Started Petrol Bunk at Mandya,Spilled Fuel From Petrol Bunk at Mandya,Mango News,Mango News Telugu,A new petrol station ,Mandya, Karnataka, left 8000 liters of petrol and 2000 liters of diesel out of the petrol station. Petrol and diesel,Karnataka Opponents Latest News,Petrol Bunk at Mandya Latest News,Petrol Bunk at Mandya Latest Updates

ఏ వ్యాపారంలో అయినా పోటీ అనేది సర్వసాధారణం. వ్యాపారంలో పోటీ వస్తున్న వ్యక్తిని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొత్తగా పెట్రోల్ బంక్ ప్రారంభించిన వ్యక్తి మీద పగ తీర్చుకోవడానికి ఏకంగా 10 వేల లీటర్ల పెట్రోల్ రోడ్డు మీద పోశారు. పొరపాటున ఎవరైనా అక్కడ సిగరేట్ తాగి వేసినా, అగ్గిపుల్ల వెలిగించినా పరిస్థితి దారుణంగా తయారయ్యేది.

కర్ణాటకలోని మండ్యలో కొత్తగా పెట్రోలు బంకును ప్రారంభించారు. అయితే ప్రత్యర్థులు పెట్రోల్ బంక్ యజమానిపై కన్నేశారు. పాత వ్యక్తిగత ద్వేషాలతో ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న నిందితులు పెట్రోల్ బంకులోని 8,000 లీటర్ల పెట్రోల్‌, 2,000 లీటర్ల డీజల్‌ను బంకులో నుంచి బయటకు వదిలేశారు. పెట్రోల్, డీజిల్‌ను రోడ్డుపై పోశారు. దీని ద్వారా యజమానికి ఒక్క గంటలో రూ. 10 లక్షలకు పైగా నష్టాన్ని కలిగించింది.

మండ్య జిల్లాలోని గ్రామ శివారులో కొత్త పెట్రోల్ బంకు ప్రారంభించి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. పెట్రోల్ బంకులో ఇంకా సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. తొలుత పెట్రోల్ పంపు ప్రారంభించిన యజమాని తరువాత నెమ్మదిగా ఇతర పనులు చేపట్టారు. అయితే దీన్ని ఆసరాగా తీసుకున్న ప్రత్యర్థులు రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్ బంకులో నుంచి 8 వేల లీటర్ల పెట్రోల్, 2 వేల లీటర్లు డీజిల్‌ను రోడ్డు మీదకు వదిలేశారు.

ఈ ఘటన మండ్య జిల్లా పాండవపుర తాలూకాలోపి బేబీ గ్రామంలో చోటుచేసుకుంది. భస్తీ రంగప్ప రెండు నెలల క్రితం బేబీ గ్రామ సమీపంలో ఇండియన్ పెట్రోల్ బంకును ప్రారంభించాడు. అయితే వ్యక్తిగత శత్రుత్వం కారణంగా రాత్రికి రాత్రే పెట్రోల్ బంకుపై దుండగులు దాడి చేశారు. ఈ సమయంలో బంక్ సిబ్బంది పెట్రోల్ పట్టడానికి ఉపయోగించే ఆటోమేటిక్ మోటర్, విద్యుత్ సరఫరా ఆపేసి భోజనానికి వెళ్లారు. దీంతో డబ్బులు దోచుకోలేని నేపథ్యంలో జనరేటర్ ఆన్ చేసిన నిందితులు బంక్‌లో ఉన్న సుమారు రూ. 10 లక్షల విలువైన పెట్రోల్, డీజిల్ రోడ్డు మీదకు వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పాండవపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే నిందితుల చేసిన పనికి ఆ ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ప్రమాదవశాత్తు పెట్రోల్ పారిన రోడ్డు మీద అగ్గిపుల్ల పడి ఉంటే.. ఆ ప్రాంతంలోని ఇళ్లు, షాపులు కాలి బూడిదై ఉండేవని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − four =