చంద్రయాన్-3, చంద్రయాన్-2 మధ్య తేడాలివే..!

Indias Moon Mission What Are Key Differences Between Chandrayaan 3 and Chandrayaan 2,Indias Moon Mission,Indias Moon Mission Key Differences,Differences Between Chandrayaan 3 and Chandrayaan 2,Mango News,Mango News Telugu,Chandrayaan-2, Chandrayaan-3, Chandrayaan-2 has Orbiter, Lander and Rover,Lunar Seismic Activity, ILSA, Moon, Chandrayaan 2 is 3,850 kg,Chandrayaan-3,Lander Module,Chandrayaan 3 Budget vs Chandrayaan 2 Budget, Rover Module,Indias Moon Mission Latest News,Indias Moon Mission Latest Updates,Indias Moon Mission Live News

చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. కాగా 2019లో చంద్రయాన్-2 మిషన్‌లో భాగంగా పంపిన ఆర్బిటర్‌తో విక్రమ్ ల్యాండర్ అనుసంధానం చేశారు. దీంతో ల్యాండర్‌ మాడ్యుల్‌ను సంప్రదించేందుకు బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌, కమాండ్‌ నెట్‌వర్కింగ్‌ కేంద్రానికి ఇప్పుడు మరింత తేలికయింది. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ మిషన్‌ జీవితకాలం ఏడేళ్లని ఇస్రో తెలిపింది.

చంద్రయాన్-2, చంద్రయాన్-3లో కొన్ని తేడాలు ఉన్నాయి. చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. అయితే చంద్రయాన్-3 ఆర్బిటర్‌ను ప్రొపల్షన్ మాడ్యూల్‌తో భర్తీ చేశారు. చంద్రయాన్-3 ల్యాండర్‌లో చంద్రునిపై ప్లాస్మా సాంద్రతను కొలవడానికి లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) కోసం ఒక పరికరాన్ని అమర్చారు. చంద్రయాన్ 2 మొత్తం బరువు 3,850 కిలోలు కాగా చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ (2,148 కిలోలు), ల్యాండర్ మాడ్యూల్ (1,752 కిలోలు), రోవర్ మాడ్యూల్ (26 కిలోలు) సహా దాదాపు 3,900 కిలోల బరువు ఉంది.

చంద్రయాన్‌ని 27 సంవత్సరాల సుదీర్ఘ మిషన్ కోసం రూపొందించారు. అయితే చంద్రయాన్-3ని మాత్రం 3 నుంచి 6 నెలల కోసం ప్రయోగించారు. చంద్రయాన్-3లో రెండు బలమైన ప్రమాదాలను గుర్తించే కెమెరాలు ఉన్నాయి. చంద్రయాన్-2లోని సింగిల్ కెమెరా మాత్రమే ఉంది. చంద్రయాన్-2 ఆర్బిటర్ తొమ్మిది ఇన్-సిట్‌ పరికరాలను తీసుకువెళ్లింది. అయితే చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్ర కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్, పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెటరీ ఎర్త్ (షేప్) అనే ఒకే పరికరాన్ని తీసుకెళ్లింది.

చంద్రయాన్-3 ల్యాండర్‌తో కూడిన లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే (LRA)ని కలిగి ఉంది. ఇది చంద్ర వ్యవస్థ డైనమిక్‌లను అర్థం చేసుకోవడానికి ద్వితీయ ప్రయోగంగా ఉపయోగపడుతుంది. కాగా చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు ప్రారంభం కానుంది. అంతా అనుకూలిస్తే బుధవారం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండర్ ల్యాండ్ కానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + two =