కేరళలో కరోనా : కొత్తగా 28481 పాజిటివ్ కేసులు, 39 మరణాలు నమోదు

Kerala Reports 28481 Positive Cases and 39 Deaths Reported in Last 24 Hours,Kerala Corona, Kerala Corona Cases, Kerala Corona Deaths, Kerala Corona Positive Cases, Kerala Corona Positive Cases Update, Kerala Coronavirus, Kerala Coronavirus Cases, Kerala Coronavirus News, Kerala Coronavirus Positive Cases, Kerala Coronavirus Updates, Kerala Covid-19, Kerala Covid-19 Cases, Kerala Covid-19 New Positive Cases, Kerala Covid-19 Updates, Kerala State Corona Positive Cases Update, Mango News

కేరళ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 80,740 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 28,481 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 35.27 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,30,258 కు చేరుకుంది. ఇక కొత్తగా కరోనాకు చికిత్స పొందుతూ మరో 39 మంది మరణించినట్టు తెలిపారు.

అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 83 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 51,026 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 7,303 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 52,36,013 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 1,42,512 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − seven =